ఐపీఎల్ వేలం.. యువీ రికార్డును బ్రేక్ చేసిన మోరిస్

ఐపీఎల్ వేలం.. యువీ రికార్డును బ్రేక్ చేసిన మోరిస్

న్యూఢిల్లీ: ఐపీఎల్ వేలంలో పాత రికార్డులు బద్దలయ్యాయి. సౌతాఫ్రికా ఆల్‌‌రౌండర్ క్రిస్ మోరిస్ అత్యధిక ధరకు అమ్ముడుపోయి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. రాజస్థాన్ రాయల్స్ రూ.16.25 కోట్లతో మోరిస్‌‌ను సొంతం చేసుకుంది. ఆర్ఆర్‌‌కు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌‌తో తీవ్ర పోటీ ఎదురైనా మోరిస్‌‌ను దక్కించుకుంది. మోరిస్ తర్వాత ఆసీస్ స్టార్ హిట్టర్ మ్యాక్స్‌‌వెల్ రూ.14.25 కోట్లకు ఎక్కువ ధరకు అమ్ముడుపోయాడు. మ్యాక్సీని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. మరో కంగారూ ప్లేయర్, ఫాస్ట్ బౌలర్ జే రిచర్డ్‌‌సన్‌‌ను రూ.14 కోట్ల ధరకు పంజాబ్ కింగ్స్‌‌ కొనుక్కుంది. ఇక అన్‌‌క్యాప్డ్ ప్లేయర్ల విభాగంలో కృష్ణప్ప గౌతమ్‌‌ను రూ.9.25 కోట్ల భారీ ధర చెల్లించి చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది.