ఐపీఎల్‌ ఆక్షన్ వేదిక ఫిక్స్.. ఈ సారి కూడా విదేశంలోనే..!

ఐపీఎల్‌ ఆక్షన్ వేదిక ఫిక్స్.. ఈ సారి కూడా విదేశంలోనే..!

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఐపీఎల్‌‌‌‌కు సంబంధించిన ఆటగాళ్ల వేలం అబుదాబిలో జరగనుంది. డిసెంబర్‌‌‌‌ 15 లేదా 16న వేలం జరిగే చాన్సుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. గతంలో దుబాయ్‌‌‌‌ (2023), జెడ్డా (2024)లో నిర్వహించిన బోర్డు ఈసారి కూడా ఇండియా వెలుపల వేదికకే మొగ్గు చూపడం గమనార్హం.  

ఇక, ప్లేయర్ల రిటెన్షన్‌‌‌‌కు ఈ నెల 15 తుది గడువు  కాగా, అంతకంటే ముందే సీఎస్కే, రాజస్తాన్‌‌‌‌ మధ్య ఓ హై ప్రొఫైల్‌‌‌‌ ట్రేడ్‌‌‌‌ జరగనుంది. సంజూ శాంసన్‌‌‌‌ సీఎస్కేలో జాయిన్ అవడం దాదాపు ఖాయం కాగా.. జడేజా, సామ్ కరన్ చెన్నైని వీడాలని డిసైడైనట్టు తెలుస్తోంది. జీటీ నుంచి సుందర్‌‌‌‌ను కూడా సీఎస్కేకు ట్రేడ్‌‌‌‌ చేయొచ్చని భావిస్తున్నారు.