క్వాలిఫయర్-1లో చేతులెత్తేసిన చెన్నై

క్వాలిఫయర్-1లో చేతులెత్తేసిన చెన్నై

చెన్నై :  ముంబైతో జరుగుతున్న ఫస్ట్ క్వాలిఫయర్ మ్యాచ్ లో చెన్నై ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ధోనీ సేన నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 131 రన్స్ మాత్రమే చేయగలిగింది. చెన్నైకి మంచి ప్రారంభం దక్కలేదు. డుప్లెసిస్, సురేష్ రైనా, వాట్సన్ పవర్ ప్లేలోనే ఔట్ కావడంతో ..10 ఓవర్లకు 50 రన్స్ మాత్రమే చేసింది. ముంబై కట్టుదిట్టమైన బౌలింగ్ తో చెన్నై ప్లేయర్లకు చుక్కలు చూపించారు. మురళి విజయ్(26), అంబటి రాయుడు(42 నాటౌట్), ధోనీ(37 నాటౌట్) మాత్రమే ఎక్కువ రన్స్ చేశారు. చివర్లో ధోనీ  మరోసారి సిక్సర్లతో రాణించడంతో చెన్నైకి ఆ మాత్రం స్కోర్ వచ్చింది.

ముంబై బౌలర్లలో..చాహర్(2), కృనాల్ పాండ్యా(1), యాదవ్(1) వికెట్లు తీశారు.