IPL: 80 పరుగుల తేడాతో చెన్నై విజయం

IPL: 80 పరుగుల తేడాతో చెన్నై విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ పై గ్రాండ్ విక్టరీ కొట్టింది చెన్నై సూపర్ కింగ్స్. పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్న ఢిల్లీ పతనాన్ని శాసించింది. దీంతో 80 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అటు లీగ్ లో 13 మ్యాచ్ లు ఆడిన CSK….9 మ్యాచుల్లో విజయం సాధించి నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచింది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్….నాలుగు వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. అయితే సీఎస్ కే కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ వాట్సన్ డకౌట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రైనాతో కలిసి మరో ఓపెనర్ డుప్లెసిస్ ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశాడు. అయితే అక్షర్ పటేల్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించిన… డుప్లెసిస్… 39 పరుగుల వ్యక్తిగ స్కోరు దగ్గర ఔట్ అయ్యాడు.

ఫస్ట్ నుంచే రైనా ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ సీజన్ లో రెండో అర్దసెంచరీ సాధించాడు. 8ఫోర్లు 1 సిక్స్ తో 59 రన్స్ చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత అనుకోకుండా క్రీజులోకి వచ్చిన జడేజా… 10 బాల్స్ లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 25 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. మ్యాచ్ లో మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ తో రఫాడించాడు కెప్టెన్ ధోనీ. 22 బాల్స్ లో 44 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. దీంతో నాలుగు వికెట్లు కోల్పోయి 179 రన్స్ చేసింది.

180 టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీకి చెన్నై బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో 99 పరుగులకే ఆలౌట్ అయ్యింది ఢిల్లీ. ఓపెనర్ షా 4 పరుగులు చేసి ఔటవ్వగా….మరో ఓపెనర్ ధావన్ 19 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 31 బాల్స్ లో నాలుగు ఫోర్లు, 1 సిక్స్ తో 44 రన్స్ చేసి ఒంటరి పోరాటం చేశాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ 5, కొలిన్ ఇన్ గ్రామ్ 1 అక్షర్ పటేల్ 9, రూథర్ ఫర్డ్ 2 రన్స్ చేసి ఔటయ్యారు. సీఎస్ కే బౌలర్ల ధాటికి అయ్యర్, ధావన్ మినహా ఏ ఒక్కరు కూడా డబుల్ డిజిట్ స్కోరు అందుకోలేక చేతులెత్తాశారు. దీంతో ఢిల్లీపై 80 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది చెన్నై సూపర్ కింగ్స్.

కేవలం 99 పరుగలకే కుప్పకూలిన ఢిల్లీని నాలుగు వికెట్లతో ఇమ్రాన్ తాహీర్, మూడు వికెట్లతో జడేజా పతనాన్ని శాశించారు.