
హైదరాబాద్ : ఆరెంజ్ ఆర్మీ మరోసారి నిరాశ పరిచింది. సొంతగడ్డపై అత్యంత పేలవ ఆటతీరుతో వరుసగా మూడో ఓటమి మూటగట్టు కుంది. బౌలర్లు చెలరేగి ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసినా.. చిన్న టార్గెట్ ను ఛేజ్ చేయలేకపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ లో ఢిల్లీ చేతిలో చిత్తయింది. బెయిర్‌స్టో, వార్నర్ మంచి ఆరంభమే ఇచ్చినా.. వీరిద్దరూ వెనుదిరిగాక మిడిలార్డర్ పేకమేడల కూలడంతో రైజర్స్ కు ఓటమి తప్పలేదు. మరోవైపు తక్కువ స్కోరే చేసినా.. పేస్ త్రయం కీమో పాల్ , రబాడ, క్రిస్ మోరిస్ అద్భుత బౌలింగ్ తో ఢిల్లీ వరుసగా మూడో మ్యాచ్ లో నెగ్గి హ్యాట్రిక్ కొట్టింది.
హైదరాబాద్, వెలుగు: సొంతగడ్డపై చెత్తగా ఆడిన సన్ రైజర్స్ హైదరాబాద్ చిత్తుగా ఓడిపోయిం ది. బౌలర్ల రాణించినా..ఓపెనర్లు అదరగొట్టినా .. మిడిలార్డర్ మళ్లీ తడబడడంతో ఉప్పల్ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ఆరెంజ్ ఆర్మీ 39 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 155 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (40 బంతుల్లో 5 ఫోర్లతో 45), కొలిన్ మన్రో (24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 40), రిషబ్ పంత్ (19 బంతుల్లో 3 ఫోర్లతో 23) రాణించారు. యువ పేసర్ ఖలీల్ అహ్మద్ (3/30) , భువనేశ్వర్ కుమార్ (2/33) సత్తాచాటారు.
ఛేజింగ్ లో ఢిల్లీ బౌలింగ్ ధాటికి హైదరాబాద్ 18.5 ఓవర్లలో 116 రన్స్‌కే కుప్పకూలి ఓడిపోయింది. డేవిడ్ వార్నర్ (47 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్ తో 51), జానీ బెయిర్ స్టో (31 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ తో 41) రాణించినా.. మిగతా తొమ్మిది మంది సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. ఢిల్లీ బౌలర్లలో కగిసో రబాడ (4/22), కీమో పాల్ (3/17), క్రిస్ మోరిస్ (3/22) నిప్పులు చెరిగే బౌలిం గ్ తో హోమ్ టీమ్ ను వణికించారు.
ఓపెనర్లు రాణించినా..
బౌలర్లు ప్రత్యర్థి ని తక్కువ స్కోరుకు నిలువరిస్తే చిన్న టార్గెట్ ఛేజింగ్ లో ఓపెనర్లు జానీ బెయిర్ స్టో , డేవిడ్ వార్నర్ జట్టుకు మంచి ఆరంభం ఇచ్చారు. రెండు మ్యాచ్ ల్లో విఫలమైన బెయిర్ స్టో హోమ్ గ్రౌండ్ లో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. మొదటి నుంచే అతను స్వేచ్ఛగా షాట్లు కొట్టగా.. మరో ఎండ్ లో వార్నర్ స్ట్రయిక్ రొటేట్ చేసే బాధ్యత తీసుకున్నాడు. ఇషాంత్ బౌలింగ్ లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన బెయిర్ స్టో , క్రిస్ మోరిస్ ఓవర్లో స్ట్రెయిట్ సిక్సర్ తో ప్రేక్షకుల్లో జోష్ నింపాడు. అప్పటి దాకా నెమ్మదిగా ఆడిన వార్నర్ .. అక్షర్ బౌలిం గ్ లో మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ బాది ఊపులోకొచ్చాడు.
కానీ, వరుస ఓవర్లలో బెయిర్ స్టో , కెప్టెన్ విలియమ్సన్ ను ఔట్ చేసిన కీమో పాల్ రైజర్స్‌కు షాకిచ్చాడు. ఆ వెంటనే మిశ్రా బౌలిం గ్ లో రికీ భుయ్ ఇచ్చిన క్యాచ్ ను మన్రో వదిలేశాడు. అప్పటి కి భుయ్ 5 పరుగులే చేశాడు. లైఫ్ దక్కినా అతను వేగంగా బ్యాటింగ్ చేయలేకపోయాడు. సాధించాల్సిన రన్ రేట్ పెరిగిన దశలో వార్నర్ బ్యాట్ కు పని చెప్పాడు. మోరిస్ వేసిన 14వ ఓవర్లలో రెండు ఫోర్లతో జోరు పెంచాడు. 16వ ఓవర్లో భుయ్ ను ఔట్ చేసిన కీమో పాల్ నాలుగు పరుగులే ఇచ్చాడు.
24 బంతుల్లో 52 రన్స్ అవసరమైన దశలో రబాడ బౌలింగ్ లో అయ్యర్ కు క్యాచ్ ఇచ్చిన వార్నర్ వెనుదిరగడంతోనే హైదరాబాద్ పోరాటం ముగిసింది. మిడిలార్డర్ మరోసారి పేకమేడలా కూలింది. తన తర్వాతి బంతికే విజయ్ శంకర్ (1)ను ఔట్ చేసిన రబాడ మ్యాచ్ ను తమవైపు లాగేసుకున్నాడు. మోరిస్ వేసిన తర్వాతి ఓవర్లో దీపక్ హుడా (3),
రషీద్ ఖాన్ (0), అభిషేక్ శర్మ (2) చెత్త షాట్లతో వికెట్లు పారేసుకోవడంతో హోమ్ టీమ్ కు ఘోర ఓటమి తప్పలేదు.
ఖలీల్, భువీ కట్టడి..
కొలిన్ మన్రో మెరుపులు మెరిపిం చినా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ , రిషబ్ పంత్ చాలాసేపు క్రీజులో ఉన్నా.. హోమ్ టీమ్ పదునైన బౌలిం గ్ ధాటికి ఢిల్లీ తక్కువస్కోరే చేయగలిగింది . మహ్మద్ నబీ ప్లేస్ లో టీమ్ లోకి వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ .. టాస్ నెగ్గి ప్రత్యర్థి ని బౌలింగ్ కు ఆహ్వానించాడు. తన ఎంపికకు, కెప్టెన్ నిర్ణయానికి న్యాయం చేస్తూ లెఫ్టార్మ్ పేసర్ ఖలీల్ అహ్మద్ వరుస ఓవర్లలో ఓపెనర్లు పృథ్వీ షా (4), శిఖర్ ధవన్ (7)ను ఔట్ చేసి ఢిల్లీని దెబ్బకొట్టాడు. అయితే, వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన కొలిన్ మన్రో చెలరేగి ఆడాడు. సీజన్ లో తొలిసారి బరిలోకి దిగిన ఈ న్యూజి లాండ్ ప్లేయర్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. సందీప్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అతను ఖలీల్‌ను లక్ష్యంగా చేసుకున్నాడు.
అతని బౌలింగ్ లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదేయడంతో పవర్ ప్లే లోనే ఢిల్లీ 51 న్స్ చేసింది. అభిషేక్ శర్మ వేసిన ఎనిమిదో ఓవర్లో లాఫ్ టెడ్ షాట్ తో ఇంకో సిక్సర్ బాదిన మన్రో భారీ ఇన్నింగ్స్ ఆడేలా కనిపిం చాడు. కానీ, అభిషేక్ చాకచక్యం గా వేసిన వైడ్ బాల్‌ను వెంటాడి కీపర్ కు చిక్కడంతో హైదరాబాద్ ఊపిరిపీల్చుకుం ది. ఆ తర్వాత కెప్టె న్ శ్రేయస్ అయ్యర్ , రిషబ్ పంత్ ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యత తీసుకున్నారు. అయితే, కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన ఆతిథ్య బౌలర్లు వీరిద్దరూ భారీ షాట్లు ఆడకుండా నిలువరించారు. ముఖ్యంగా హార్డ్ హిట్టర్ పంత్ ను కట్టడి చేశారు. దాంతో, ఢిల్లీ ద్వయం ఒక్కో పరుగు చేరుస్తూ స్కోరు వంద దాటించిం ది. వీరిద్దరూ నాలుగు బంతుల తేడాతో ఔటవడంతో జట్టు లయ దెబ్బ తిన్నది. భువీ వేసిన 16వ ఓవర్లో అయ్యర్ కీపర్ కు చిక్కగా..
ఖలీల్ లో ఫుల్‌టాస్ ను లిఫ్ట్ చేసిన పంత్ .. హుడాకు క్యాచ్ ఇచ్చాడు. ఈ వెం టనే క్రిస్ మోరిస్ (4)ను రషీద్ బౌల్డ్ చేశాడు. అక్షర్ పటేల్ (14 నాటౌట్ ) చివర్లో కొన్ని పరుగులు చేశాడు. చివరి ఐదు ఓవర్లలో 29 పరుగులే ఇచ్చిన హైదరాబాద్ నాలుగు వికెట్లు పడగొట్టింది.
.@delhicapitals win by 39 runs at Hyderabad – an all-round and emphatic victory ?#SRHvDC #VIVOIPL pic.twitter.com/JuW2k3ofmg
— IndianPremierLeague (@IPL) April 14, 2019