IPL ఫైనల్ : చెన్నై టార్గెట్-150

IPL ఫైనల్ : చెన్నై టార్గెట్-150

హైదరాబాద్ : చెన్నైతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో ముంబై ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 రన్స్ చేసింది. ప్రారంభంలో చెలరేగిన ముంబైని కట్టుదిట్టమైన బౌలింగ్ తో కట్టడి చేసింది చెన్నై.  పవర్ ప్లేలో ఓపెనర్లు ఔట్ కావడంతో ముంబై దూకుడు తగ్గింది. ఆ తర్వాత వరుసగా వికెట్లు పడటంతో ఆచితూచి ఆడారు. చివర్లో పొలార్డ్ రాణించడంతో ముంబైకి గౌరవప్రధమైన స్కోర్ దక్కింది.

ముంబై ప్లేయర్లలో..డికాక్(29), రోహిత్(15), సూర్యకుమార్ యాదవ్(15), కృనాల్ పాండ్యా(7), ఇషాంత్ కిషన్(23), పొలార్డ్(41- నాటౌట్), హార్ధిక్ పాండ్యా(16), చాహర్(0), మెక్లెనగల్(0), బుమ్రా(0 -నాటౌట్) రన్స్ చేశారు.

చెన్నై బౌలర్లలో..దీపక్ చాహర్(3), శార్దూల్ ఠాకూర్(2), ఇమ్రాన్ థాహీర్(2)వికెట్లు తీశారు.