ఐపీఎల్ ఫ్రాంచైజీల ఆవేదన

ఐపీఎల్ ఫ్రాంచైజీల ఆవేదన

న్యూఢిల్లీ: ‘విదేశీ లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెటర్లను అనుమతించకూడదు’ అన్న బీసీసీఐ నిర్ణయంపై ఐపీఎల్ ఫ్రాంచైజీలు భగ్గుమన్నాయి. బోర్డు తీసుకున్న నిర్ణయం సరైంది కాదని, అశాస్త్రీయమైందని ధ్వజమెత్తాయి. ‘ఇప్పటివరకు బీసీసీఐ నుంచి ఈ అంశంపై ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. మీడియాలో వస్తున్న కథనాలను మాత్రమే చూస్తున్నాం. ఒకవేళ అవి నిజమైతే బోర్డు నిర్ణయం చాలా అన్యాయమైంది. ఎందుకంటే మాకు అందుబాటులో ఉన్న వనరులను మేం ఎక్కడైనా ఉపయోగించుకునే హక్కు మాకు ఉంటుంది.  

ఒకవేళ బీసీసీఐ ఇది అన్యాయమని భావిస్తే దానికి సరైన కారణాలు చెప్పాలి. ఇండియాలోనూ, ఫారిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో పెద్ద మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి ప్లేయర్లను తీసుకుంటున్నాం. వాళ్లను ఎక్కడైనా ఉపయోగించుకునే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాకు ఇవ్వాలి. లేకపోతే మేము చాలా నష్టపోతాం’ అని ఓ ఫ్రాంచైజీ అధికారి ఆవేదన వ్యక్తం చేశాడు.