IPL చరిత్రలో ఇదే చెత్త రికార్డ్ : 8 పరుగులకే 7 వికెట్లు

IPL చరిత్రలో ఇదే చెత్త రికార్డ్ : 8 పరుగులకే 7 వికెట్లు

మొహాలీ: ఈ సారి IPLలో అందరిచూపు ఢిల్లీపైనే. ఇప్పటివరకు ఒక్కసారి కూడా కప్ కొట్టని ఢిల్లీ ఈ సారి మాత్రం ఇరగదీస్తుందనే టాక్. అయితే ఢిల్లీ తన ఫస్ట్ మ్యాచ్ లోనే పటిష్టమైన ముంబైపై గెలిచి అందరి అంచనాలను తలకిందులు చేసింది. అయితే ఈ టీమ్ కు అదృష్టంతో పాటు దురదృష్టం వెంటాడటం ప్రతీసారి కామన్. ఇందుకు ఉదాహరణ సోమవారం పంజాబ్ తో జరిగిన మ్యాచ్ అనే చెప్పాలి. ముంబై బౌలింగ్ 213 రన్స్ చేసిన ఢిల్లీ..పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 168 రన్స్ చేయలేకపోయింది. అయితే ఓ దశలో ఈజీగా గెలుస్తుందనుకున్నారు. కానీ 8 రన్స్ తేడాతో ఏకంగా 7 వికెట్లు కోల్పోయి గెలిచే మ్యాచ్ ను చేతులారా చేజార్చుకుంది ఢిల్లీ క్యాపిటల్స్.

మ్యాచ్‌ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 14 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. ఢిల్లీ చేతిలో 7 వికెట్లు ఉన్నాయి.. చివర్లో 21 బాల్స్ లో 21 రన్స్ కావాలి. కానీ పంజాబ్‌ ఆల్‌ రౌండర్‌ సామ్‌ కరన్‌ విజృంభించి హ్యాట్రిక్‌ వికెట్లు సాధించడంతో ఢిల్లీ 8 రన్స్ కే 7 వికెట్లు కోల్పోయింది. మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ మాట్లాడుతూ.. ‘ఇది తీవ్ర నిరుత్సాహం కలిగించింది. 8 రన్స్ కే 7 వికెట్లు కోల్పోవడం నమ్మశక్యంగా లేదు. ఈ ఓటమిని ఒప్పుకోవడానికి నా దగ్గర మాటల్లేవు. ఒకవైపు ఇంగ్రామ్‌ ఆచితూచి ఆడుతుంటే.. మేమంతా పెవిలియన్‌ కు క్యూ కట్టాము. టీమ్ ను విజయం దిశగా నడిపించేందుకు ఏ ఒక్కరూ ముందడుగు వేయలేదు. పంజాబ్‌ టీమ్ అన్ని విషయాల్లోనూ రాణించింది. వాళ్లు ఒత్తిడిని బాగా ఎదుర్కొన్నారు’ అని శ్రేయస్‌ తెలిపాడు.

ఈ మ్యాచ్‌ లో 16.3ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 144 పరుగులతో ఢిల్లీ పటిష్ఠ స్థితిలో ఉంది. ఆ తర్వాత బంతికే పంత్‌ అవుట్‌ అయ్యాడు. ఆ వెంటనే ఇన్‌ గ్రామ్‌ కూడా పెవిలియన్‌ కు చేరుకున్నాడు. అంతే మిగితా ఆటగాళ్లంతా పోటీపడి డ్రెస్సింగ్‌ రూమ్‌ కు క్యూకట్టారు. దీంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. 17 బాల్స్ లోనే 7 వికెట్లు కోల్పోయింది. ఇలా జరగడం IPL చరిత్రలో ఇదే తొలిసారి.