IPL ఒక్కో ఫ్రాంచైజీకి 80 కోట్లు లాస్

IPL ఒక్కో ఫ్రాంచైజీకి 80 కోట్లు లాస్

ముంబై: ఈసారి ఐపీఎల్ జరిగినా ఫ్రాంచైజీలు పెద్ద మొత్తంలో నష్టాలను చవి చూడనున్నాయి. వివో వైదొలగడం, యూఏఈలో మ్యా చ‌ లు నిర్వహించాల్సి రావడం, గేట్‌ రెవె న్యూ లేకపోవడంతో ప్రతి ఫ్రాంచైజీ దాదాపు రూ. 80 కోట్ల వరకు లాస్‌ అవుతాయనిఅంచనా వేస్తున్నారు. అయితే ఈ నష్టం లో కొంత మొత్తాన్ని భరించాలని బీసీసీఐని రిక్వెస్ట్‌‌‌‌ చేస్తున్నా.. బోర్డు అందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. సాధారణంగా ప్రతి ఫ్రాంచైజీకి రూ. 22 నుంచి 28 కోట్ల గేట్‌ రెవె న్యూ (టికెట్ల అమ్మకంతో) లభిస్తుంది.కానీ ఈసారి అది కష్టమే. టీమ్‌ స్పాన్సర్‌‌‌‌షిప్‌‌‌‌ రెవె న్యూలో కూడా ఈసారి 15 నుంచి 20 శాత కోత పడనుంది. రూ. 100 కోట్లు దాటిన ముంబై ఇండి యన్స్‌‌‌‌ మినహాయిస్తే.. టీమ్‌ స్పాన్సర్‌‌‌‌షిప్‌‌‌‌ ద్వారా ప్రతీ ఫ్రాంచైజీ ఏడాదికి రూ. 50 నుంచి 70 కోట్లు సంపాదిస్తుంది. సాధారణంగా ఐపీఎల్‌‌‌‌ ద్వారా వచ్చే మొత్తం ఆదాయం (సెంట్రల్‌‌‌‌ పూల్‌‌‌‌) నుంచి బీసీసీఐ యాభై శాతం అన్ని ఫ్రాంచైజీలకు పంచుతుం ది. వివో స్పాన్సర్ షిప్‌‌‌‌ విలువ ఏడాదికి రూ. 440 కోట్లు. ఇందులో యాభై శాతం షేర్ అంటే రూ. 220 కోట్లు ఎనిమిది ఫ్రాంచైజీల ఖాతాలోకి వెళ్తాయి. కానీ, ఈసారి వివో స్పాన్సర్ షిప్‌‌‌‌ రద్దవడంతో ఒక్కో ఫ్రాంచైజీ రూ. 28 కోట్లు నష్టపోతున్నాయి. వివో టైటిల్‌‌‌‌ స్పాన్సర్ విలువలో 50—60 శాతం ఇచ్చే కొత్త స్పాన్సర్ బీసీసీఐకి లభించినప్పటికీ ఫ్రాంచైజీలకు కొంత నష్టం తప్పదు. ఈ మూడింటి తో ప్రతి జట్టు రూ.70–75 కోట్లు కోల్పోవడం ఖాయమే.