
ముంబై : వాంఖడే స్టేడియం వేధికగా శనివారం రాజస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 రన్స్ చేసింది. ముంబైకి మంచి ప్రారంభం దక్కింది. గాయం నుంచి కోలుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో ఫర్వాలేదనిపించగా..ఓపెనర్ డికాక్ (81) హాఫ్ సెంచరీతో దుమ్ము రేపాడు. వీరిద్దరు కలిసి ఫస్ట్ వికెట్ కు 96 రన్స్ చేశారు. ఆ తర్వాత 11వ ఓవర్ లో రోహిత్(47) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్, పోలార్డ్ తక్కువ రన్స్ కే ఔట్ కావడంతో ముంబై స్కోర్ తగ్గింది. చివర్లో హార్ధిక్ పాండ్యా (28: 11 బాల్స్ లో 3 సిక్సులు, 1ఫోర్ ) రాణించడంతో రాజస్తాన్ ముందు ఛాలెంజింగ్ టార్గెట్ ను 185 ముందుంచింది ముంబై.
ముంబై ప్లేయర్లలో..రోహిత్(47), డికాక్(81), హార్ధిక్ పాండ్యా(28) రన్స్ తో రాణించారు.
రాజస్తాన్ బౌలర్లలో..జోఫ్రా ఆర్చర్(3), ధావల్ కుల్ కర్ణి(1), జయదేవ్ ఉనద్కత్(1) వికెట్స్ తీశారు.