భళా బట్లర్ : ముంబైపై రాజస్థాన్ థ్రిల్లింగ్ విక్టరీ

భళా బట్లర్ : ముంబైపై రాజస్థాన్ థ్రిల్లింగ్ విక్టరీ

ముంబై : వాంఖడే వేధికగా శనివారం ముంబైతో జరిగిన మ్యాచ్ లో గ్రేట్ విక్టరీ సాధించింది రాజస్థాన్. 4 వికెట్ల తేడాతో రాయల్ గా రాణించింది రాజస్థాన్. బట్లర్ దూకుడుతో వార్ వన్ సైడ్ అయ్యింది. ముంబై విసిరిన 188 రన్స్ ఛేజింగ్ ను మరో 3 బాల్స్ ఉండగానే రీచ్ అయి విక్టరీ సాధించింది రహానే టీమ్.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 187 రన్స్ చేసింది. కెప్టెన్‌ రోహిత్‌శర్మ(47, 32 బాల్స్ లో 6×4, 1×6), క్వింటన్‌ డికాక్‌(81, 52బాల్స్ లో  6×4, 4×6) మొదటి నుంచీ దూకుడుగా ఆడి ఆ టీమ్ కు మంచి శుభారంభాన్ని అందించారు. ఫస్ట్ వికెట్‌కి వీరిద్దరూ 96 పరుగులు జోడించాక రోహిత్‌ ఔటయ్యాడు. తర్వాత క్వింటన్‌ హాఫ్ సెంచరీతో చెలరేగి స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో సూర్యకుమార్‌(16), కీరణ్‌ పోలార్డ్‌ (6) తక్కువ పరుగులకే పెవిలియన్‌ చేరడంతో డికాక్‌, హార్దిక్‌ పాండ్య నిలకడగా రాణించారు. చివర్లో డికాక్‌, ఇషాన్‌ కిషన్‌(5) వెంటనే ఔటైనా హార్దిక్ పాండ్య(28, 11 బాల్స్ లో 1×4, 3×6) బౌండరీలతో చెలరేగి రాజస్థాన్‌ ముందు 188 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించాడు.

188 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్తాన్.. అజింక్యా రహానే(37, 21 బాల్స్ 6×4, 1×6), జాస్‌ బట్లర్‌(89, 43బాల్స్ 8×4, 7×6) బౌండరీలతో చెలరేగి, మంచి శుభారంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ ఫస్ట్ వికెట్‌ కు 60 రన్స్ చేశాక రహానే ఔటయ్యాడు. బట్లర్‌, సంజుశాంసన్‌(31) నిలకడగా ఆడి రాజస్థాన్‌ ను విజయంవైపు తీసుకెళ్లారు. ఈ క్రమంలో శాంసన్‌ ఔటయ్యాక రాజస్థాన్‌ 16 ఓవర్లకు 168/2తో పటిష్టస్థతిలో నిలిచింది. రాజస్థాన్‌ విజయం ఈజీ అనుకున్న సమయంలో 17, 18 ఓవర్లలో వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో అందరిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.  చివర్లో శ్రేయాస్‌ గోపాల్‌ ధాటిగా ఆడి ముంబయిని మట్టికరిపించాడు.