ఐపీఎల్‌‌‌ 13లో ఫిక్సింగ్‌ కలకలం

ఐపీఎల్‌‌‌ 13లో ఫిక్సింగ్‌ కలకలం

న్యూఢిల్లీ: యూఏఈలో జరుగుతున్నఐపీఎల్‌‌‌‌-13లో ఫిక్సింగ్‌ కలకలం. మ్యాచ్‌ లో కరప్షన్ కు పాల్పడాలంటూ తనను సంప్రదించారని ఓ క్రికెటర్‌ ..బీసీసీఐ యాంటీ కరప్షన్‌‌‌‌ యూనిట్‌‌‌‌ (ఏసీయూ)కు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన ఏసీయూ దీనిపై విచారణ మొదలుపెట్టింది. ఇక నుంచి ప్రతి మ్యాచ్‌ ను నిశితంగా పరిశీలిం చాలని హైఅలర్ట్‌ ప్రకటించింది. ప్లేయర్‌ తమను అప్రోచ్‌ అయిన విషయాన్ని ఏసీయూ చీఫ్‌ అజిత్‌ సింగ్‌ ధ్రువీకరించాడు. ‘ఎవరో వ్యక్తి క్రికెటర్‌ ను సంప్రదించినట్లు మాకు
ఫిర్యాదు అందింది. వాళ్లను ట్రాక్‌‌‌‌ చేస్తున్నాం . కాస్త టైమ్‌ పడుతుంది’ అనిసింగ్‌ పేర్కొన్నా డు. యాంటీ కరప్షన్‌‌‌‌ రూల్స్‌ ప్రకారం క్రికెటర్‌ , ఫ్రాంచైజీ పేర్లను బయటకు వెల్లడించకూడదు. దీంతో ఫిర్యాదు చేసిన ప్లేయర్‌ పేరును బహిర్గతం చేయలేదు. వాస్తవానికి బయో సెక్యూర్‌ ఎన్విరాన్‌‌‌‌మెంట్‌‌‌‌లో ఉన్న ప్లేయర్లను అజ్ఞాత వ్యక్తులు నేరుగా కలవడం దాదాపు అసాధ్యం . అయితే ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ ద్వారా బుకీలు సంప్రదించే చాన్స్‌ లేకపోలేదు.