
జైపూర్: IPL సీజన్ -12లో భాగంగా సోమవారం రాజస్థాన్, పంజాబ్ మధ్యన జరిగిన మ్యాచ్ పై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కెప్టెన్ అశ్విన్.. బట్లర్ ను ఔట్ చేసిన విధానాన్ని తప్పు పట్టాడు రాజస్థాన్ రాయల్స్ మెంటార్ షేన్‌వార్న్. పంజాబ్ కెప్టెన్ అశ్విన్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. రాజస్థాన్ కు కావాల్సిన టార్గెన్ ను రీచ్ చేయడంతో మంచి జోరుమీదున్న బట్లర్ ను అనూహ్యా రీతిలో ఔట్ చేసిన అశ్విన్ మ్యాచ్ ను తలకిందులు చేశాడు. బట్లర్ ను ఔట్ చేసేందుకు అశ్విన్ మన్కడింగ్ విధానాన్ని అమలు చేశాడు. రాజస్థాన్ కీలక సమయంలో బట్లర్ వికెట్ కోల్పోవడం అందిరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం చెలరేగుతోంది. క్రీడాభిమానులు, క్రికెటర్లు అశ్విన్ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ అతడిపై మండి పడ్డాడు.
కెప్టెన్‌గా, వ్యక్తిగతంగా అశ్విన్ నిరాశపరిచాడని వార్న్ తెలిపాడు. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని, కెప్టెన్లందరూ IPL నిబంధనలకు లోబడి ఆడాలన్నాడు. ఆ సమయంలో అశ్విన్ కు ఆ బాల్ వేసే ఆలోచన లేదని.. అందుకే బట్లర్ ను రనౌట్ చేశాడని.. దాన్ని డెడ్ బాల్ గా పరిగణించాల్సి ఉండేదని వార్న్ చెప్పాడు. IPLలో ఇలాంటివి మంచిది కాదని BCCIని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు. ఈ విజయం ఆటగాళ్ల మానసికస్థితిని చెడగొడుతుందని, అన్నిటికంటే క్రీడాస్ఫూర్తే ముఖ్యమని తెలిపాడు. భావితరాలకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. అశ్విన్ క్రీడా సమగ్రతను కాపాడుతాడనుకుంటే నిరాశపరిచాడని.. ఈ ఘటనపై BCCI తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు మరో ట్వీట్ చేశాడు షేన్ వార్న్. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ 14 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. బట్లర్ ఔట్ అయ్యే సమయానికి రాజస్థాన్ టీమ్ 12 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 108 రన్స్ చేసింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ 4 వికెట్ల నష్టానికి 184 రన్స్ చేసింది. లక్ష్య చేదనలో బరిలోకి దిగిన రాజస్థాన్ 9 వికెట్ల నష్టానికి 170 రన్స్ చేసి ఓడి పోయింది. ఈజీగా గెలుస్తుందనుకున్న రాజస్థాన్..బట్లర్ ఔట్ కావడంతో..ఆ తర్వాత వచ్చిన ప్లేయర్లు వరుసగా పెవిలియన్ కు చేరారు. దీంతో పంజాబ్ విక్టరీలో కీలకం అయ్యాడు ఆ టీమ్ కెప్టెన్ అశ్విన్.
Spirit of Cricket – what's that?? Certainly not in Ravi Ashwin's vocabulary. Disgraceful scenes as he Mankads Jos Buttler in an IPL match. Shame on you, and shame on the team. Money makes fools out of you – enjoy while you can. https://t.co/CvOiRGAssO
— Johnny Bell (@jbatmbkl) March 26, 2019
So disappointed in @ashwinravi99 as a Captain & as a person. All captains sign the #IPL wall & agree to play in the spirit of the game. RA had no intention of delivering the ball – so it should have been called a dead ball. Over to u BCCI – this a not a good look for the #IPL
— Shane Warne (@ShaneWarne) March 25, 2019