సూపర్‌ చెన్నై : IPLలో బోణీ కొట్టిన ధోనీ సేన

సూపర్‌ చెన్నై : IPLలో బోణీ కొట్టిన ధోనీ సేన

ఉరుముల్లేని వానలా, మెరుపుల్లేని తుపానును తలపించేలా ఐపీఎల్‌ సంప్రదాయానికి భిన్నంగా ఎలాంటి హంగామా లేకుండా ఇండియన్‌‌ ప్రీమియర్‌‌ లీగ్‌ టీ20 ధనాధన్‌‌  దంగల్‌ మొదలైంది. సిక్సర్లు, ఫోర్లతో హోరెత్తుతుందనుకున్న చెన్నై సూపర్‌‌ కింగ్స్‌‌ – రాయల్‌ చాలెంజర్స్‌‌  బెంగళూరు జట్ల మొదటి మ్యాచ్‌ సింపుల్‌ గా ముగిసింది. నాలుగో సారి టైటిల్‌ వేటను మొదలుపెట్టిన చెన్నై సూపర్‌‌ అనిపించేలా ఆడి.. ఈ సారైనా టైటిల్‌ గెలుచుకోవాలనుకుంటున్న రాయల్‌ చాలెం జర్స్‌‌ బెంగళూరుకు షాకిచ్చింది.

చెపాక్‌ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఆరంభ మ్యాచ్‌ లో గత సీజన్‌ విజేత చెన్నై  సూపర్​ కింగ్స్​​7 వికెట్ల తేడాతో బెం గళూరును ఓడించిం ది. విరాట్‌ కోహ్లీ (6), డివిల్లీయర్స్ (9), హెట్‌ మైర్‌ (0) వంటి హార్డ్‌‌‌‌‌‌‌‌ హిట్టర్లు చేతులెత్తేసిన వేళ బెంగళూరు 17.1 ఓవర్లలో 70 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్‌ పార్థి వ్‌ పటేల్‌ (35బంతుల్లో 2 ఫోర్లతో 29) టాప్‌ స్కోరర్‌ . బెం గళూరు ఇన్నింగ్ స్‌ లో మూడు ఫోర్లు, ఒక్క సిక్సర్‌ మా త్రమే ఉందంటే.. ప్రధాన పేసర్‌ శార్దూ ల్‌ ఠాకూర్‌ ఒక్క బంతి వేయకుండానే వారి ఆట ముగిసిందంటే చెన్నై బౌలర్లు ఏ రేంజ్‌ లో చెలరేగారో చెప్పొచ్చు . హర్భజన్‌ సిం గ్‌ , ఇమ్రాన్‌ తాహిర్‌ చెరో మూడు వికెట్లతో సత్తా చాటగా.. రెండు వికెట్లతో పాటు రెండు కీలక క్యాచ్‌ లు పట్టిన రవీంద్ర జడేజా ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు.  చెన్నై 17.4 ఓవర్లలో మూడు వికెట్లకు 71 రన్స్‌ చేసి గెలిచింది. అంబటి రాయుడు (42బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌ తో 28) రాణించాడు. హర్భజన్‌ కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కిం ది.

ఆదివారం జరిగే మ్యాచ్‌ లో సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌ కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌‌తోనూ, మూడు సార్లు చాంపి యన్‌‌ ముం బై ఇండియన్స్‌‌ జట్టు టైటిల్‌ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్‌‌తో ఢీ కొడుతుంది.