నేడు సన్ రైజర్స్ vs కోల్ కతా నైట్ రైడర్స్

నేడు సన్ రైజర్స్ vs కోల్ కతా నైట్ రైడర్స్

హైదరాబాద్‌ , వెలుగు: గత మ్యాచ్‌ లో నెగ్గి విజయాలబాట పట్టిన సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ..మరో సవాల్‌ కు సిద్ధమైంది. ఆదివారం కోల్‌ కతానైట్‌ రైడర్స్‌ తో అమీతుమీ తేల్చుకోనుంది. సొంతగడ్డపై గత మ్యాచ్‌ లో సమష్టి ప్రదర్శన చేసిన ఆరెంజ్‌ ఆర్మీ.. అదే జోరుతో ఈ మ్యాచ్‌ లో నెగ్గి ప్లే ఆఫ్‌ రేసులో ముందుకెళ్లాలని భావిస్తోంది.మరోవైపు వరుసగా నాలుగు మ్యాచ్‌ లు ఓడినకోల్‌ కతాకు ఈ మ్యాచ్‌  కీలకం కానుంది.

దెబ్బకు దెబ్బ తీస్తా రా?

ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌ లో కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకోవాలని హైదరాబాద్‌ ఆరాటపడుతోంది. ఆమ్యాచ్‌ లో ఆరెంజ్‌ ఆర్మీ విజయానికి చేరువగావచ్చింది. కానీ, 19 బంతుల్లో నే 49 పరుగులుబాదిన ఆండ్రీ రసెల్‌ రైజర్స్‌ కు షాకిచ్చా డు.అయితే టోర్నీ సగం పూర్తి చేసుకున్నవేళ ఇప్పటికే వరుస ఓటములతో డీలా పడిన నైట్‌ రైడర్స్‌ పైనెగ్గా లని సన్‌ రైజర్స్‌ భావిస్తోంది. టాపార్డర్‌ లో జానీ బెయిర్‌ స్టో , డేవిడ్‌ వార్నర్‌ అద్భుత ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు. బ్యాటింగ్‌ లైనప్‌ కు వీరిద్దరూ మూల స్థంభాలుగా నిలబడుతున్నారు. అయితే మిడిలార్డర్‌ నుంచి ఏమాత్రం సహకారం లభించడం లేదు. గత సీజన్‌ లో దుమ్మురేపిన కేన్‌ విలియమ్సన్‌ ఇంకా ఫామ్‌‌‌‌‌‌‌‌లో కి రాలేదు. మిడిలార్డర్‌ లో యూసుఫ్‌ పఠాన్‌ , దీపక్‌ హుడా, విజయ్‌‌‌‌‌‌‌‌ శంకర్‌ సత్తాచా టాల్సిన అవసరముంది. ఇక బౌలింగ్‌ లో భువనేశ్వర్‌ , ఖలీల్‌ అహ్మద్‌ , రషీద్‌ ఖాన్‌ అదరగొడుతున్నారు. ఈ మ్యాచ్‌ లో విజయం సాధించి ప్లేఆఫ్‌ బెర్త్‌‌‌‌‌‌‌‌ వైపు వడివడిగా అడుగులు వేయాలని సన్‌ రైజర్స్‌ భావిస్తోంది.

రసెల్‌‌‌‌‌‌‌‌పైనే నైట్‌‌‌‌‌‌‌‌ రైడర్స్భారం

మరోవైపు ఈ ఏడాది ఐపీఎల్‌ లో ఇప్పటి వరకుకోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ అంతగా ఆకట్టు కోలేదు.జట్టుగా సమష్టిగా విఫలమవుతోంది. రసెల్‌ ఒంటి చేత్తో మ్యాచ్‌ లను గెలిపించడం మినహా ఆ జట్టుబ్యా టింగ్‌ లైనప్‌ గాడి తప్పుతోం ది. కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ నాయకుడిగా ముందుండి నడిపించలేక పోతున్నాడు. ఇక ఆఖర్లో సుడి గాలిలా విరుచుకుపడుతున్న రసెల్‌ .. తనను బ్యా టింగ్‌ఆర్డర్‌ లో కాస్త ముందుగా పంపితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నాడు. శుక్రవారం రాయల్‌చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌ లో రసెల్‌ ముందుగా బ్యాటింగ్‌ కు వస్తే ఫలితం మరోలా ఉండేదని చాలా మంది పేర్కొంటున్నారు. టాపార్డర్‌ లో క్రిస్‌ లిన్‌ , సునీల్‌ నరైన్‌ , రాబిన్‌ ఉతప్ప విఫలమవడం జట్టును కలవరపరుస్తోంది. ఏదేమైనా ప్లే ఆఫ్‌ రేసులో నిలవాలంటే ఇకనుంచి ప్రతీ మ్యాచ్‌ ను చా వోరేవోలాగా భావించి కోల్‌ కతా బరిలోకి దిగాల్సి న అవసరముంది.కోల్‌ కతా బౌలింగ్‌ కూడా చాలా సాధారణంగాఉంది. స్పి న్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ , పియూష్‌ చావ్లా తేలిపోతున్నారు. పేసర్లలో ప్రసిధ్‌ కృష్ణ, హ్యారీ గర్నీ  బౌలింగ్‌ లో పదును చూపెట్టడం లేదు.వీలైనంత త్వరగా ఆజట్టు గాడిన పడితేనే నాకౌట్‌రేసులో ముందుంటుంది.

జట్లు (అంచనా)

సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ : విలియమ్సన్‌ (కెప్టెన్‌ ),బెయిర్‌ స్టో , వార్నర్‌ , శంకర్‌ , హుడా, యూసుఫ్‌ ,రషీద్‌ , భువనేశ్వర్‌ , సందీప్‌ , నదీమ్‌‌‌‌‌‌‌, ఖలీల్‌ .

కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ : కార్తీక్‌ (కెప్టెన్‌ ), లిన్‌ , నరైన్‌ ,ఉతప్ప, నితీశ్‌ , రసెల్‌ , శుభ్‌ మాన్‌ , ప్రసిధ్‌ , గర్నీ, చావ్లా , కుల్దీప్