
మొహాలీ : IPL సీజన్ -12లో భాగంగా సోమవారం మొహాలీ వేదికగా పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచింది ఢిల్లీ. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రెండు టీమ్స్ లోనూ ఓపెనర్ బ్యాట్స్‌మెన్ మంచి ఫామ్ లో ఉన్నారు. పంజాబ్ బ్యాట్స్ మన్ క్రిస్ గేల్, ఢిల్లీ ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ మధ్య పోరు ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ఈ ఇద్దరూ రెచ్చిపోతే ప్రతి సారి మోరిస్ దే పైచేయి. గేల్ ను కట్టడి చేసేందుకు క్రిస్ మోరిస్ ను ప్రయోగించే అవకాశం ఉంది.
ఢిల్లీలో చిచ్చరపిడుగుల్లా రెచ్చిపోతున్న రిషభ్ పంత్, పృథ్వీ షాను కట్టడి చేసేందుకు అశ్విన్ ప్రణాళికలు వేసుకుంటున్నాడు. అశ్విన్ కెప్టెన్సీ లోని కింగ్స్ ఎలెవన్ పంజాబ్, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని ఢిల్లీ క్యాపిటల్స్ విజయంపై ధీమాతో ఉన్నాయి.
టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి..
Here's the Playing XI for #KXIPvDC pic.twitter.com/kvx7SzdoVH
— IndianPremierLeague (@IPL) April 1, 2019