భారీగా పెరిగిన ఐపీఎల్‌‌‌‌‌‌ వ్యూయర్షిప్

భారీగా పెరిగిన ఐపీఎల్‌‌‌‌‌‌ వ్యూయర్షిప్

ముంబై: ఐపీఎల్‌‌‌‌ క్రేజ్‌‌‌‌ రోజురోజుకూ కొత్త శిఖరాలను తాకుతోంది. ప్రస్తుత సీజన్‌‌‌‌ డిజిటల్‌‌‌‌ ఫ్లాట్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో సరికొత్త రికార్డులకు సృష్టిస్తుండగా, టెలివిజన్‌‌‌‌ రంగంలోనూ భారీ ఆదరణ లభిస్తోంది. డిజిటల్ మాధ్యమాల్లో ఐపీఎల్ వీక్షణ సమయం (వాచ్-టైమ్) 7 శాతం పెరిగినట్లు అధికారిక బ్రాడ్‌‌‌‌కాస్టర్ ‘జియోస్టార్‌‌‌‌’ ప్రకటించింది. 

టీవీల్లో ఈ టోర్నీని వీక్షిస్తున్న వారి సంఖ్య త్వరలోనే 50 కోట్ల (500 మిలియన్లు) మార్కును దాటేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించింది. ఐపీఎల్ డిజిటల్ రీచ్ మొత్తంగా 15 శాతం వృద్ధి సాధించిందని తెలిపింది. టీవీలో ప్రసారమైన 51 మ్యాచ్‌‌‌‌లు, డిజిటల్ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లలో అందుబాటులో ఉన్న 57 మ్యాచ్‌‌‌‌ల గణాంకాల ఆధారంగా ఈ వివరాలను విడుదల చేసింది. 

ప్రాంతీయ భాషల ప్రసారాల వాచ్‌‌‌‌ టైమ్‌‌‌‌ ఏకంగా 42 శాతం వృద్ధి నమోదు చేయడం విశేషం. మరోవైపు గత సీజన్‌‌‌‌తో పోలిస్తే ఈసారి ప్రకటనదారుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. దాదాపు 125 మంది కొత్త అడ్వర్టైజర్లు లీగ్‌‌‌‌తో జతకట్టారు. జియోస్టార్ డిజిటల్ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌తో 22 మంది స్పాన్సర్లు భాగస్వామ్యం కుదుర్చుకోగా, లీనియర్ టీవీ ప్రసారాల కోసం 16 మంది స్పాన్సర్లు ముందుకు వచ్చారు.