సగం సీజన్ లో ప్లేయర్లు ట్రాన్స్‌‌ఫర్‌‌ అవుతారా?..

సగం సీజన్ లో ప్లేయర్లు ట్రాన్స్‌‌ఫర్‌‌ అవుతారా?..

దుబాయ్‌‌‌‌:  ఐపీఎల్‌‌‌‌ పదమూడో ఎడిషన్‌‌‌‌ సగం ముగిసింది. అన్ని జట్లూ తలో ఏడు మ్యాచ్‌‌‌‌లు ఆడేశాయి. కొన్ని టీమ్స్‌‌‌‌ అంచనాలను అందుకుంటే, మరికొన్ని నిరాశ పరిచాయి. ప్లేయర్లలోనూ కొందరు స్టార్లు సత్తా చాటితే, మరికొందరు ఏ మాత్రం ఆకట్టుకోవడం లేదు. అదే టైమ్‌‌‌‌లో  పలువురు యంగ్‌‌‌‌స్టర్స్‌‌‌‌, డొమెస్టిక్‌‌‌‌ క్రికెటర్లు వచ్చిన చాన్స్‌‌‌‌ను సద్వినియోగం చేసుకుంటున్నారు. కానీ, చాలా మంది టాలెంటెడ్‌‌‌‌ ప్లేయర్లకు అసలు అవకాశాలే రావడం లేదు. ఇంటర్నేషనల్‌‌‌‌ స్టార్లతో పాటు దమ్మున్న దేశవాళీ కుర్రాళ్లూ ఇంకా బెంచ్‌‌‌‌కే పరిమితం అయ్యారు. అలాంటి వాళ్లు ఇప్పుడు ఇతర జట్ల జెర్సీ వేసుకొని గ్రౌండ్‌‌‌‌లోకి రాబోతున్నారు. ‘మిడ్‌‌‌‌ సీజన్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ విండో’ (ప్లేయర్ల బదిలీ)  ద్వారా ఇతర జట్ల తరఫున బరిలోకి దిగే చాన్స్‌‌‌‌ వారికి లభించనుంది. ఈ విండో  మంగళవారమే ఓపెన్‌‌‌‌ అయింది. లాస్ట్‌‌‌‌ సీజన్‌‌‌‌లోనే ప్రవేశపెట్టిన ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ను జట్లు వినియోగించుకోలేదు. అయితే, ఈ సారి రూల్స్‌‌‌‌లో కొన్ని మార్పులు చేశారు. ఈసారి తమ టీమ్‌‌‌‌లోని ఇండియన్‌‌‌‌, ఇంటర్నేషనల్‌‌‌‌ ప్లేయర్లను ఇతర జట్లకు బదిలీ చేసుకునే వెలుసుబాటు ఇచ్చారు. అలాగే, అన్‌‌‌‌క్యాప్డ్‌‌‌‌ ప్లేయర్లతో పాటు క్యాప్డ్‌‌‌‌ ప్లేయర్లకూ ఈ రూల్‌‌‌‌ వర్తించనుంది. మంగళవారం నుంచి ఐదు రోజుల పాటు ఈ విండో అందుబాటులో ఉంటుంది.

ఎవరు వెళ్లొచ్చు

మిడ్‌‌‌‌ సీజన్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ రూల్‌‌‌‌ ప్రకారం సగం లీగ్‌‌‌‌ ముగిసిన తర్వాత (ప్రతి జట్టూ 7 మ్యాచ్‌‌‌‌లు ఆడాలి) రెండు జట్లు పరస్పర అంగీకారంతో ఆటగాళ్లను మార్చుకోవచ్చు. దీనికి ఎంత చెల్లించాలనేది కూడా ఫ్రాంచైజీల ఇష్టం. లీగ్‌‌‌‌లో మిగిలున్న మ్యాచ్‌‌‌‌లను బట్టి రేటు మాట్లాడుకోవచ్చు. అయితే, బదిలీ అయ్యే ప్లేయర్‌‌‌‌ లీగ్‌‌‌‌లో రెండు కంటే ఎక్కువ మ్యాచ్‌‌‌‌లు ఆడకూడదు. ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ విషయాన్ని ఐపీఎల్‌‌‌‌ గవర్నింగ్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌కు తెలియజేయాలి.

ఎంతకాలం చెల్లుబాటు

ఇది పర్మనెంట్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ కాదు. ఈ సీజన్‌‌‌‌కు మాత్రమే వర్తిస్తుంది. ఉదాహరణకు  క్రిస్‌‌‌‌ గేల్‌‌‌‌ను చెన్నైకి ట్రేడ్‌‌‌‌ చేస్తే రూల్స్‌‌‌‌ ప్రకారం వచ్చే ఏడాది అతను మళ్లీ పంజాబ్‌‌‌‌కు అందుబాటులోకి రావాలి.

ఎవరికి చాన్స్‌‌‌‌

ఈ సీజన్‌‌‌‌లో చాన్స్​ రాని, ఒకటి లేదా రెండు మ్యాచ్‌‌‌‌లే ఆడిన ప్లేయర్లు చాలా మందే ఉన్నారు. వాళ్లంతా ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌కు అర్హులే. అయితే, ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ అజింక్యా రహానె, చెన్నై స్పిన్నర్‌‌‌‌ ఇమ్రాన్‌‌‌‌ తాహిర్‌‌‌‌, ముంబై ఇండియన్స్‌‌‌‌ ఓపెనర్‌‌‌‌ క్రిస్‌‌‌‌ లిన్‌‌‌‌, పంజాబ్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ దీపక్‌‌‌‌ హుడా ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ లిస్ట్‌‌‌‌లో ఫేవరెట్స్‌‌‌‌ అని  వార్తలు వస్తున్నాయి. రహానె ఒకే మ్యాచ్‌‌‌‌ ఆడగా.. తాహిర్‌‌‌‌, లిన్‌‌‌‌, దీపక్‌‌‌‌ హుడా బరిలోకి దిగలేదు. అయితే, రహానె, క్రిస్‌‌‌‌ను వదులుకునేందుకు ఢిల్లీ, ముంబై సిద్ధంగా లేవని సమాచారం. ఇంటర్నేషనల్‌‌‌‌ ప్లేయర్లను ఇచ్చేసి ప్రత్యర్థి జట్లను బలోపేతం చేయాలని ఆయా ఫ్రాంచైజీలు అనుకోవడం లేదట. అయితే, దీపక్‌‌‌‌ హుడా లాంటి డొమెస్టిక్‌‌‌‌ ప్లేయర్లు మాత్రం ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ అయ్యే అవకాశాలున్నాయి.

పేరెంట్‌‌ టీమ్‌‌పై ఆడకూడదు

 ట్రాన్స్‌‌ఫర్‌‌ ద్వారా వేరే జట్టుకు బదిలీ అయిన ఆటగాడు ఈ సీజన్‌‌తో తన పేరెంట్‌‌ టీమ్‌‌తో మ్యాచ్‌‌లో ఆడేందుకు అనుమతించరు. ఉదాహరణకు గేల్‌‌ చెన్నైకి బదిలీ అయితే..  నవంబర్‌‌ ఒకటో తేదీన ఆ జట్టు పంజాబ్‌‌తో తలపడే మ్యాచ్‌‌లో అతను ఆడకూడదు.