ముంబై: భారతదేశంలో ప్రతి ఏడాది 20 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.80 లక్షల కోట్ల) విలువైన ఐపీఓలు రావడం సాధారణమైందని ఫైనాన్షియల్ సంస్థ జేపీ మోర్గాన్ పేర్కొంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 21 బిలియన్ డాలర్ల విలువైన ఇష్యూలు జరిగాయి. ఈ ఏడాది చివరికి ఈ నెంబర్ 23 బిలియన్ డాలర్లు దాటే అవకాశం ఉంది.
‘‘ఐపీఓ డిమాండ్‌లో ఐదో వంతు కన్జూమర్ టెక్, న్యూ ఏజ్ బిజినెస్‌లకు వస్తోంది. ఇది వచ్చే 5 ఏళ్లలో 30శాతం దాటుతుంది. కనీసం 20 స్టార్టప్‌లు ఐపీఓలకు సిద్ధమవుతున్నాయి. అందులో 4–5 కంపెనీల ఇష్యూ సైజ్ 1 బిలియన్ డాలర్ల చొప్పున ఉన్నాయి”అని జేపీ మోర్గాన్ ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్స్ (ఈసీఎం) హెడ్ అభినవ్ భారతి అన్నారు.
ఐపీఓల వాల్యుయేషన్స్ బాగా ఎక్కువగా ఉండడానికి కారణం ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నిస్తుండడమే అని ఆయన తెలిపారు. మొత్తం ఈక్విటీ మార్కెట్ చూస్తే, ఐపీఓలు, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్స్, ఫాలో ఆన్స్ వంటివి కలిపి 65 బిలియన్ డాలర్ల విలువైన ఇష్యూలు మాత్రమే ఈ ఏడాది జరిగాయి. కిందటేడాది 72 బిలియన్ డాలర్ల విలువైన ఇష్యూలు జరిగాయి.

