భోజనం ప్లేట్ పడేసి డ్యూటీకి రా.. కానిస్టేబుల్ తో పోలీస్ అధికారి

భోజనం ప్లేట్ పడేసి డ్యూటీకి రా.. కానిస్టేబుల్ తో పోలీస్ అధికారి

మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి మోహన్​ యాదవ్​ .. యూపీలోని అజంగఢ్​ లో  జరిగిన బీజేపీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అజంగఢ్​ పోలీస్​ ఉన్నతాధికారి చర్యలు వైరల్​ గా మారాయి.  ఐపీఎస్​ అధికారి ఓ వృద్ద పోలీసును తినే ఆహారాన్ని ... వదలి విధులకు హాజరు కావాలని ఆదేశించిన ఘటన సోషల్​ మీడియాలో హల్​ చల్​ చేస్తుంది.

కోటి విద్యలు కూటి కొరకే... అన్న సామెత బహుశా ఆ కానిస్టేబుల్​ కు వర్తించదేమో.. ఓ ఐపీఎస్​ బాస్​ .. అతి చిన్న ఉద్యోగి అయిన కానిస్టేబుల్​ను ఆదేశించిన తీరు చూస్తే .. విధుల్లో ఉన్నప్పుడు   ఆయనకు అన్నం తినేందుకు అవకాశం లేదా అనిపిస్తుంది.  వివరాల్లోకి వెళ్తే.... మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి మోహన్​ యాదవ్.. యూపీలోని అజంగఢ్​ లో బీజేపీ నిర్వహించిన  అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో అజంగఢ్​ పోలీసు ఉన్నతాధికారి... ఓ వృద్ద కానిస్టేబుల్​ ను ఆదేశించిన తీరు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతుంది.  

సహజంగా ముఖ్యమంత్రి పర్యటనలో పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహిస్తారు.  కార్యక్రమం నిర్వహించే ప్రదేశంలో భోజనాలు.. టీ... అల్పాహారం లాంటివి ఏర్పాటు చేస్తారు.  అక్కడకు వచ్చిన అతిథిలతో పాటు పోలీసులు కూడా భోజనం చేస్తుంటారు.  అజంగఢ్​ లో కూడా అలానే ఓ వృద్ద కానిస్టేబుల్​ భోజనం చేస్తుండగా ... ఐపీఎస్​ అధికారి.. ఇక్కడకు తినడానికి రాలేదు.. విధులు నిర్వహించేందుకు వచ్చాం.. తినడం ఆపి డ్యూటీకి వెళ్లమని ఆదేశించారు.

అప్పుడు ఆ వృద్ద కానిస్టేబుల్​ తన అధికాని ఆదేశం ప్రకారం.. తినే ఆహారాన్ని ప్లేట్​ తో సహా డస్ట్​ బిన్​ లో పడేసి ... వాష్​ బేసెన్​ దగ్గర చేతులు కడుక్కొని భోజనం చేయకుండానే వెళ్లాడు.  ఈ ఈవెంట్​ కు తినడానికి రాలేదని... డ్యూటీ చేసేందుకు వచ్చాడని... ఉన్నతాధికారి అనే మాటలు ఈ వీడియోలో వినపడుతున్నాయి. రాజకీయ నాయకుల పర్యటనల  వల్ల పోలీసులు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి విధులు నిర్వహించాల్సి వస్తుంది. ఒక్కోసారి పండుగల సమయంలో కూడా ఇళ్లకు వెళ్లలేని పరిస్థితిలో పోలీసులున్నారు.  అజంగఢ్​ లో అన్నం తినకుండా డ్యూటీ చేయమని ఐసీఎస్​ అధికారి... శుభమ్​ అగర్వాల్​ అనే వృద్ద కానిస్టేబుల్​ను ఆదేశించారు.  ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతుంది.