ఐపీఎస్ ఆఫీసర్లకు ప్రాధాన్యమున్న పోస్టులిస్తలేరు : రఘునందన్ రావు

ఐపీఎస్ ఆఫీసర్లకు ప్రాధాన్యమున్న పోస్టులిస్తలేరు : రఘునందన్ రావు

ఇటీవల బదిలీ చేసిన 93 ఐపీఎస్ ఆఫీసర్లలో ఒక్కరికి కూడా కీలక పోస్టు ఇవ్వలేదని బీజేపీ ఎమెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. తెలంగాణలో ఐపీఎస్ అధికారులకు ప్రాధాన్యత పోస్టులకు ఇవ్వడం లేదన్నారు. అత్యంత ప్రాధాన్యత ఉన్న డీజీపీ, అడిషనల్ డీజీపీ, ఐజీ హైదరాబాద్ రేంజ్ జోన్ పోస్టులను కూడా బిహార్ కు చెందిన వ్యక్తులకే కట్టబెట్టారని చెప్పారు. ఒకప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు చెందిన వ్యక్తి కాదని, ఆయన బీజాలన్నీ బిహార్ లోనే ఉన్నట్టు కొంతమంది ఆంధ్రా పెద్దలు ఆరోపించారని చెప్పారు.

కానీ ఇప్పుడు ఆయన, మంత్రులు, ఎమ్మెల్యేలు చేసే పనులు చూస్తుంటే నాక్కూడా అదే అనుమానం వస్తోందని రఘునందన్ అన్నారు. తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్లందర్నీ పక్కన పెట్టి చీఫ్ సెక్రటర్ ని చేశారో, ఒక బిహార్ చెందిన వ్యక్తిని ఆఫీసర్ గా చేసినప్పుడే తనకు డౌట్ వచ్చిందని కామెంట్ చేశారు. కేసీఆర్ మూలం కూడా బిహార్ నుంచే ఉంది కావచ్చు అని రఘునందన్ చెప్పారు. ఆ తర్వాత రీసెంట్ గా నియమితులైన డీజీపీ కూడా బిహార్ కు చెందిన వారేనన్నారు. అందుకే తెలంగాణ బాస్ కూడా బిహార్ వాసేనా అని అనుమానం కలుగుతోందని స్పష్టం చేశారు.