హైదరాబాద్, వెలుగు: ఐకూ తాజా ఫ్లాగ్షిప్ ఫోన్ ఐకూ 12 అమెజాన్‌లో 4.6 రేటింగ్‌లో అత్యంత పాపులర్‌గా నిలిచిందని కంపెనీ ప్రకటించింది. భారతదేశంలో అత్యధిక రేటింగ్ పొందిన స్మార్ట్‌ఫోన్‌గా అవతరించడం ద్వారా భారీగా అమ్మకాలు సాధిస్తోందని తెలిపింది. ఈ ఫోన్ 12జీబీ+256జీబీకి రూ. 53 వేలు కాగా,16జీబీ+512జీబీ వేరియంట్ కోసం రూ. 58 వేలు చెల్లించాలి.
