IQOO neo7: మార్కెట్‌లోకి ఐక్యూ నియో7 5జీ

IQOO neo7: మార్కెట్‌లోకి ఐక్యూ నియో7 5జీ

ఐక్యూ నియో 6 మొబైల్‌కి సక్సెసర్‌‌గా నియో సిరీస్‌లో కొత్త మోడల్‌ను ఐక్యూ తీసుకురానుంది. దీనికి ఐక్యూ నియో7  అని పేరుపెట్టింది. ఈ మొబైల్ వచ్చే నెల 16న ఇండియాలో లాంచ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్‌ డైమెన్సిటీ 8200 చిప్‌సెట్‌ని వాడారు. ఈ ప్రాసెసర్‌‌తో ఇండియాలో రిలీజ్ అవుతున్న మొదటి ఫోన్‌ ఇది. ఇందులో 6.78 అంగుళాల ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది.  

ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో 50 ఎంపీ మెయిన్ కెమెరా, 8 ఎంపీ వైడ్ ఆంగిల్‌, 2 ఎంపీ మాక్రో కెమెరా ఉన్నాయి. 16 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఈ ఫోన్లో స్పెషల్. 120 వాట్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తుంది. 8+128 జీబీ, 12+ 256 జీబీ వేరియెట్లలో మూడు కలర్లలో ఐక్యూ నియో7ని తీసుకొస్తున్నారు. దీని ధర రూ.30,000 నుంచి మొదలవుతుందని అంచనా.