కరోనా బాధితుల కోసం డాక్టర్ల డ్యాన్స్.. వైరల్ వీడియో

కరోనా బాధితుల కోసం డాక్టర్ల డ్యాన్స్.. వైరల్ వీడియో

కరోనా వైరస్ సోకిన బాధితులకు ట్రీట్మెట్ అందించడం అంత ఈజీ కాదు. రోజులు తరబడి నిద్రాహారాలు మాని రోగులకు చికిత్స చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి ప్రాణం పోసే  డాక్టర్లే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. అయితే ఇరాన్ కు చెందిన  వైద్యులు కరోనా వ్యాధి గ్రస్తులకు చికిత్స చేస్తూ వారికి మనోధైర్యాన్ని నింపేందుకు  ప్రాణాలకు సైతం లెక్క చేయడం లేదు.

ఇరాన్ లోని కరోనా వ్యాధి గ్రస్తులకు చికిత్స చేస్తున్న వైద్యులు ఇరాన్ డ్యాన్స్ తో అట్రాక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఆ సన్నివేశాలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియోలు పోస్ట్‌ చేసిన కొద్ది క్షణాల్లోనే లక్షలాది మంది వీక్షించారు. వైద్యులు  రోగులను చూసుకుంటూ…. వారి కుటుంబాల్లోనూ మనోధైర్యాన్ని నింపుతున్నారని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

పెరుగుతున్న కరోనా మృతులు

మరోవైపు ఇరాన్ లో కరోనా వైరస్ కోరలు చాచుతుంది. గురువారానికి కరోనా సోకి  107 మంది మృతి చెందగా..591నుంచి 3,513కి వ్యాధి సోకినట్లు ఆదేశ అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అయితే అధికారిక గణాంకాల్ని ఊటంకిస్తూ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఇర్నా ఓ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. రాజధాని టెహ్రాన్, గిలాన్ ప్రావిన్స్ లో వైరస్ ఎక్కువగా ఉందని, కానీ ప్రభుత్వ గణాంకాల్లో ఆ రెండు ప్రాంతాల్లో వైరస్ లేదని ఎలా చెబుతుందని ప్రశ్నిచింది.  బీబీసీ పర్షియన్ ప్రకారం గత నెలలో దేశ ఆరోగ్య వ్యవస్థ వర్గాలు చెప్పిన వివరాల ఆధారంగా కరోనా బాధితుల మరణాల సంఖ్య కనీసం 210 పైగా  ఉందని చెప్పింది. టెహ్రాన్ ,కోమ్లో నగరాల్లో ఎక్కువ మంది బాధితులు ఉన్నారని బీబీసీ తెలిపింది.