ENG vs IND 2025: టీమిండియాతో టెస్ట్ సిరీస్.. సచిన్, ద్రవిడ్ ఆల్‌టైం రికార్డ్స్‌పై రూట్ కన్ను

ENG vs IND 2025: టీమిండియాతో టెస్ట్ సిరీస్.. సచిన్, ద్రవిడ్ ఆల్‌టైం రికార్డ్స్‌పై రూట్ కన్ను

టెస్టుల్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆల్ టైం రికార్డ్ ఒకటి ప్రమాదంలో పడింది. టెస్టు ఫార్మాట్ లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ రికార్డ్ ను ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్ అధిగమించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 13 వేల పరుగుల క్లబ్ లోకి చేరుకున్న రూట్.. మరో మూడేళ్లు తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తే సచిన్ రికార్డ్ బ్రేక్ చేసి సరికొత్త చరిత్ర సృష్టిస్తాడు. అయితే అంతకంటే ముందు రూట్ మరో సచిన్ మరో ఆల్ టైం రికార్డ్ పై గురి పెట్టాడు. రూట్ టెస్టుల్లో తన పరుగుల ప్రవాహాన్ని కొనసాగిస్తున్నాడు. లీడ్స్ వేదికగా ఇండియాతో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో 53 పరుగులు చేసి ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

రూట్ కు ఇది టెస్టుల్లో 66 వ హాఫ్ సెంచరీ. కాగా.. ఈ ఫిఫ్టీతో వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ శివనారాయణ్ చంద్రపాల్ సమం చేసి రెండో స్థానంలో నిలిచాడు. ఓవరాల్ గా టెస్ట్ క్రికెట్ లో 68 హాఫ్ సెంచరీలతో సచిన్ టెండూల్కర్ అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. టీమిండియాతో ఇంగ్లాండ్ మరో నాలుగు టెస్ట్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. మొత్తం నాలుగు నుంచి 8 ఇన్నింగ్స్ ఆడే ఛాన్స్ రూట్ కు రావచ్చు. వీటిలో ఒక మూడు హాఫ్ సెంచరీలు చేసిన టెస్ట్ క్రికెట్ లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా రూట్ చరిత్ర సృష్టిస్తాడు. సచిన్ పరుగుల రికార్డ్ విషయానికి వస్తే రూట్ మరో 2834 పరుగులు చేయాలి.

టెస్ట్ క్రికెట్ లో అత్యధిక హాఫ్ సెంచరీలు:
 
సచిన్ టెండూల్కర్--68

జో రూట్--66 

శివనారాయణ్ చంద్రపాల్--66
 
రాహుల్ ద్రవిడ్--63

అలన్ బోర్డర్--63 

రికీ పాంటింగ్--62 

రాహుల్ ద్రవిడ్ తో సమంగా:

అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో అత్యధిక క్యాచ్ లు పట్టిన ఫీల్డర్ గా చరిత్ర సృష్టించడానికి రూట్ సిద్ధమయ్యాడు. ప్రస్తుతం రాహుల్ ద్రవిడ్ తో కలిసి 210 క్యాచ్ లతో సంయుక్తంగా టాప్ లో ఉన్నాడు. రూట్ మరో క్యాచ్ పడితే టెస్ట్ క్రికెట్ లో ఒక ఫీల్డర్ గా అత్యదిక క్యాచ్ లు పట్టిన ప్లేయర్ గా నిలుస్తాడు. ప్రస్తుతం జరుగుతున్న ఇండియా సిరీస్‌లో రూట్ ద్రవిడ్‌ను అధిగమించే అవకాశం ఉంది.