
ఇటీవలి కాలంలో పలు ప్రాంతాల్లో భూకంపాలు అత్యంత ఆందోళలను కలిగిస్తున్నాయి. ఢిల్లీ, ఆఫ్ఘనిస్తాన్ లో ఈ మధ్య కాలంలో వచ్చిన భూప్రకంపనలు అక్కడి ప్రజలను భయాందోళనలకు గురి చేశాయి. తాజాగా దక్షిణ ఇరాన్‌లో 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. US జియోలాజికల్ సర్వే ప్రకారం, 5 తీవ్రతతో సంభవించిన భూకంపం గణనీయమైన నష్టాన్ని కలిగిస్తుంది.
ఇరాన్ లో భూకంపం రావడం ఇదేం మొదటిసారి కాదు. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో రోజుకు ఒక భూకంపం సంభవిస్తుందని పలువురు చెబుతూ ఉంటారు. 2003లో, 6.6 తీవ్రతతో సంభవించిన భూకంపం చారిత్రక నగరం బామ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ఈ ఘటనలో దాదాపు 26వేల మంది మరణించారు.
5.5 earthquake, 62 km NNW of Bandar Abbas, Iran. Oct 17 5:10:03 UTC (20m ago, depth 10km). https://t.co/39qih25NOV
— Earthquakes (@NewEarthquake) October 17, 2023
Felt it? report it here: https://t.co/1wKTzHT2qS