ఇరాన్‌ కూల్చిన డ్రోన్‌ ప్రత్యేకతలివే

ఇరాన్‌ కూల్చిన డ్రోన్‌ ప్రత్యేకతలివే

తమ భూభాగంలోకి వచ్చిందని ఓ అమెరికా డ్రోన్‌‌ను ఇరాన్‌‌ కూల్చేసింది. దీనిపై అమెరికా మస్తు సీరియస్‌‌ అయింది. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణమే ఏర్పడింది. అమెరికా అంత సీరియస్‌‌ ఎందుకైంది? ఏముంది ఆ డ్రోన్‌‌లో? దాని ప్రత్యేకతలేంటి?

డ్రోన్‌ పేరు: ఆర్‌‌క్యూ 4ఏ
ఖరీదు: సుమా రు రూ. 1,500 కోట్లు
పొడవు: 14 మీటర్లు
రెక్కల పొడవు: 39 మీటర్లు. బోయింగ్‌‌ 737 ప్యాసెంజర్‌‌ జెట్‌‌ రెక్కల పొడవంత.
బరువు: 12 టన్నులు
రేంజ్‌ : 22,780 కిలోమీటర్లు
పని: సముద్రంపై, తీర ప్రాంతాల్లో సమాచారం సేకరించేందుకు అమెరికా వాడుతోంది.

ప్రత్యేకతలు: పగలు, రాత్రి అని తేడా లేకుండా ఎప్పుడైనా, ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా హై రిజల్యూషన్‌‌ ఫొటోలు తీయగలదు. 18 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించగలదు. అంటే కమర్షియల్‌‌ ఫ్లైట్ల కన్నా రెండిం తల ఎత్తులో వెళ్తుందన్నమాట. ఇన్‌‌ఫ్రారెడ్‌‌, థర్మల్‌‌ ఇమేజింగ్‌‌, రాడార్‌‌, ఎలక్ట్రో ఆప్టికల్‌‌ ఇమేజింగ్‌‌ వ్యవస్థలున్నాయి. ఒక్కసారి స్టార్టయితే 32 గంటలు వెళ్లగలదు. ఎక్కడెక్కడ పని చేసింది?: ఇరాక్‌‌, అఫ్గానిస్థాన్‌‌, ఉత్తర ఆఫ్రికా, గ్రేటర్‌‌ ఆసియా పసిఫిక్‌‌ ప్రాంతాల్లో మిలిటరీ ఆపరేషన్లలో పాల్గొంది.