ఇరాన్ దాడితో అమెరికాకు రూ.6వేల700 కోట్ల నష్టం

ఇరాన్ దాడితో అమెరికాకు రూ.6వేల700 కోట్ల నష్టం

పశ్చిమాసియాలో ఇరాన్ జరిపిన ప్రతీకార దాడులు అమెరికాకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. యుద్ధం ప్రారంభమైన మొదటి రెండు వారాల్లోనే గల్ఫ్ లోని అమెరికా సైనిక స్థావరా లపై దాడుల కారణంగా.. సుమారు 800 మిలియన్ల డాలర్ల (రూ.6,700 కోట్లు) నష్టం జరిగిన ట్లు సమాచారం. 

ఈ మేరకు బీబీసీ అండ్ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ తన నివేదికలు వెల్లడించాయి. జోర్డాన్లోని అమెరికా బేస్పై జరిగిన దాడిలో రాడార్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలిపాయి. ఈ రాడార్ వ్యవస్థ విలువ 485 మిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. 

మరోవైపు కువైట్, ఖతార్, సౌదీ అరేబియాలోని విమానాశ్రయాలు, ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థలపై దాడితో 310 మిలియన్ల డాలర్ల నష్టం జరిగిందని అంచానా వేశాయి.

►ALSO READ | మిసైళ్ల దాడికి ఇండ్లు ఎలా డ్యామేజ్ అవుతున్నాయో చూడండి.. వైరల్ అవుతున్న వీడియో !