మళ్లీ బోర్డర్ దాటితే ఊరుకోం.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్

మళ్లీ బోర్డర్ దాటితే ఊరుకోం.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్

అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం మరింత హీటెక్కింది. తమ దేశ సరిహదద్దు భూభాగంలోకి వచ్చిందన్న కారణంతో జూన్ 20వ తేదీన అమెరికాకు చెందిన హ్యాక్ ఐ డ్రోన్ ను ఇరాన్ కూల్చింది. దీనిపై అమెరికా ఇప్పటికే భగ్గుమంటోంది. తమ డ్రోన్ ఇరాన్ లోకి వెళ్లలేదని..  అంతర్జాతీయ సరిహద్దు  ఇవతలే ఉందనీ.. ఇరాన్ కవ్వింపు దాడి చేసిందని ఆరోపించింది. యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్… ఇందుకు అమెరికా బదులు తీర్చుకుంటుందని కూడా ఇప్పటికే చెప్పారు. యుద్ధం మొదలైతే.. వారంరోజుల్లో ఇరాన్ ఖేల్ ఖతం అవుతుందని కూడా చెప్పారు.

ఐతే.. అమెరికా హెచ్చరికను ఇరాన్ రాజధానిలోని టెహ్రాన్ ప్రభుత్వ కార్యాలయం లైట్ గా తీసుకుంది. అమెరికాకు మరో గట్టి వార్నింగ్ ఇచ్చింది. మళ్లోసారి గనుక తమ అంతర్జాతీయ సరిహద్దు దాటి ముందుకొస్తే ఇంతకంటే కఠినమైన బదులిస్తామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఆలీ లారిజనీ చెప్పారు. డ్రోన్ కూల్చివేత అనేది తమ వైఖరేంటో చెప్పకనే చెప్పిందని ఆయన అన్నారు.