కుర్దిస్థాన్పై ఇస్లామిక్ తిరుగుబాటు

కుర్దిస్థాన్పై ఇస్లామిక్ తిరుగుబాటు

ఇరాక్ లోని కుర్దిస్థాన్ పై ఇస్లామిక్ తిరుగుబాటు దారులు మిసైల్స్, డ్రోన్లతో విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో 13 మంది చనిపోగా.. మరో 58 మంది గాయపడ్డారు. మృతుల్లో గర్భిణీ కూడా ఉందని అధికారులు తెలిపారు. ఇరాన్ లోని ఇస్లామిక్ తిరుగుబాటు దారులు పొరుగునున్న ఇరాక్ లోని కుర్దిష్ రీజియన్ పై బాంబుల వర్షం కురిపించారు. తమ దేశంలో గత కొంతకాలంగా.. జరుగుతున్న అలజడికి ఇరాక్ ఉగ్రవాదులే కారణమని ఈ దాడికి దిగినట్లు సమాచారం. 

కుర్దిస్థాన్ లోని సులేమానియా, ఎర్బిల్ పై బాంబు దాడులు చేశారని అధికారులు వెల్లడించారు. కాగా, ఇరాన్ కు చెందిన డ్రోన్లు ఇరాక్ లోని ఎర్బిల్ వైపు వెళ్లినట్లు యూఎస్ ఆర్మీ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఈ దాడి వల్ల అమెరికన్ ఆర్మీ బేస్ కు ఎలాంటి నష్టం జరగలేదంది.