హిజాబ్ ధరించలేదని ఇరాన్ ప్లేయర్కు బెదిరింపులు

హిజాబ్ ధరించలేదని ఇరాన్ ప్లేయర్కు బెదిరింపులు

కజకిస్తాన్‭లో జరిగే అంతర్జాతీయ టోర్నమెంట్‭లో హిజాబ్ లేకుండా పోటీపడిన ఇరాన్‭కు చెందిన క్రీడాకారిణిని.. తిరిగి రావద్దని ఆ దేశం హెచ్చరించింది. ఇరాన్‭కు చెందిన సారా కదీం అనే యువతి హిజాబ్ లేకుండానే వరల్డ్ ర్యాపిడ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్ షిప్‭లో పాల్గొంది. తాజాగా ఇరాన్‭లో ఉన్న ఆమె బంధువులు, తల్లిదండ్రులకు కూడా బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే కజక్ పోలీసులు ఆమెకు భద్రత కల్పించినట్లు సమాచారం. 

సారా కదీం గత వారం అల్మాటీలో జరిగిన వరల్డ్ ర్యాపిడ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్ షిప్‭లో హిజాబ్ లేకుండా పాల్గొంది. ఇరాన్ డ్రెస్ కోడ్ ప్రకారం మహిళలు హిజాబ్ ధరించడం తప్పనిసరి. అయితే ఆమె ఈ రూల్‭ను పక్కనపెట్టి ఆడటాన్ని ఇరాన్ లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. 

గతేడాది సెప్టెంబర్‭లో మహస ఆమిని అనే 22 ఏళ్ల యువతి హిజాబ్ సరిగ్గా ధరించిలేదని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆమె పోలీసు కస్టడీలో అనుమానాస్పదంగా మృతి చెందటంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఆమె మరణంతో ప్రారంభమైన ఆందోళనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ నిరసనలకు దేశంలోని అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలిపారు. ఇక ఇరాన్ లో జరిగిన ఆందోళనల్లో అనేక అల్లర్లు చోటు చేసుకున్నాయి. నిరసనకారుల్లో 11 మందికి మరణ శిక్ష విధించగా, వందల మందికి జైలు శిక్ష విధించారు.