ప్రజల ముందుకు ఖమేనీ.. యుద్ధం తర్వాత తొలిసారి బంకర్ నుంచి బయటికి

ప్రజల ముందుకు ఖమేనీ.. యుద్ధం తర్వాత తొలిసారి బంకర్ నుంచి బయటికి

టెహ్రాన్: ఇజ్రాయెల్​తో యుద్ధం తర్వాత ఇరాన్‌‌ సుప్రీం లీడర్‌‌ అయతుల్లా అలీ ఖమేనీ తొలిసారి ప్రజల ముందుకు వచ్చారు. సెంట్రల్ టెహ్రాన్‌‌లోని ఓ మసీదులో నిర్వహించిన షియా మతస్తుల ఆషురా వేడుకల్లో ఖమేని పాల్గొన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్‌‌ యుద్ధం నేపథ్యంలో ఇంతకాలం ఖమేనీ బంకర్​లో దాక్కున్నారు. ఆదివారం బయటికొచ్చి వేదికపై కూర్చొని మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో.. ప్రభుత్వ అధికారిక చానెల్​లో టెలికాస్ట్ అయింది. 

ఖమేనీ వేదికపైకి రాగానే.. బ్లాక్ డ్రెస్సులు వేసుకున్న వాళ్లంతా నిలబడి.. ఆయనకు మద్దతుగా పిడికిలి బిగించి నినాదాలు చేశారు. ఆషురా వేడుకలకు హాజరైన ఖమేనీ.. షియా ఇస్లాంలో మహ్మద్ ప్రవక్త మనవడు హుస్సేన్ సేవలను స్మరించుకున్నారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. ప్రముఖ మత గాయకుడు హాజ్ మహమూద్ కరిమీతో ఆయన మాట్లాడారు.