ఆగస్టు 16 నుంచి పంచజ్యోతిర్లింగాల యాత్ర ..భారత్ గౌరవ్ పేరిట ప్రత్యేక ప్యాకేజీ

ఆగస్టు 16 నుంచి పంచజ్యోతిర్లింగాల యాత్ర ..భారత్ గౌరవ్  పేరిట ప్రత్యేక ప్యాకేజీ
  • ప్రకటించిన ఐఆర్​సీటీసీ 

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఐఆర్​సీటీసీ ఆధ్వర్యంలో పంచజ్యోతిర్లింగాల దర్శనం చేయించేందుకు ‘భారత్​ గౌరవ్​’ పేరిట ప్రత్యేక రైలును అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ రైలు ఈ నెల16న సికింద్రాబాద్​నుంచి బయలు దేరుతుంది. యాత్ర 9 రోజుల పాటు కొనసాగుతుంది. ఇందులో మహాకాళేశ్వర్​, ఓంకారేశ్వర్, త్రయంబకేశ్వర్, భీమశంకర్, గృష్ణేశ్వర్​ ఆలయాల దర్శనం ఉంటుంది. 

సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 2గంటలకు బయలుదేరి కామారెడ్డి, నిజామాబాద్​, ధర్మాబాద్​, ముద్కేడ్​, నాందేడ్​, పూర్ణా మీదుగా ఉజ్జయినీ వరకు వెళ్తుందన్నారు. యాత్రలో వసతి, భోజనం వంటి వాటితోపాటు ఆలయాల దర్శనం కూడా ప్యాకేజీలో ఉంటుందన్నారు. ఒక్కరికి స్లీపర్​అయితే రూ.14,700, 3 ఏసీ రూ.22,900, 2ఏసీ రూ.29,900 చార్జ్ చేయనున్నారు. ప్యాకేజీలో రోజుకు మూడు సార్లు భోజనాలు,  వసతి,  పర్యాటక రవాణా సౌకర్యాలు కల్పిస్తారు. ప్రతి బోగీలో ఐఆర్​సీటీసి సిబ్బంది అందుబాటులో ఉంటారు. వివరాల కోసం వెబ్‌‌సైట్: www.irctctourism.com, ఫోన్​నంబర్లు 9701360701, 9281030740,9281030750,9281030711 సంప్రదించాలన్నారు.