దసరా, దీపావళికి ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకునేటోళ్లకు గుడ్ న్యూస్

దసరా, దీపావళికి ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకునేటోళ్లకు గుడ్ న్యూస్

దసరా, దీపావళి పండుగలకు మన దేశంలో లక్షల మంది సిటీల నుంచి సొంతూళ్లకు వెళుతుంటారు. ఉద్యోగ రీత్యానో, వ్యాపారం కోసమో సొంతూరికి వందల కిలోమీటర్ల దూరంలో ఉండేటోళ్లంతా దసరా, దీపావళి పండుగలకు పల్లె బాట పడుతుంటారు. అలాంటి వాళ్లలో ఎక్కువ మంది రైళ్లను ఆశ్రయిస్తుంటారు. ఎందుకంటే.. పండుగ వస్తుందంటే బస్సు ఛార్జీలను అమాంతం పెంచేయడం మన దేశంలో ఆనవాయితీ అయిపోయింది. దీంతో.. మధ్య తరగతి జనం రైళ్లలో సొంతూళ్లకు చేరుకుంటుంటారు. ఇలా.. దసరా, దీపావళి పండుగలకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ట్రైన్ టికెట్ ధరలపై 20 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు IRCTC తెలిపింది. అయితే.. రాను, పోనూ కలిపి ట్రైన్ టికెట్లు బుక్ చేసుకుంటేనే ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. 2025, అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 26 మధ్య బయల్దేరి వెళ్లి, నవంబర్ 17 నుంచి డిసెంబర్ 1 మధ్య తిరుగు ప్రయాణం చేసే ప్రయాణికులు రానుపోను రౌండ్ ట్రిప్ బుక్ చేసుకుంటే మాత్రమే ఈ 20 శాతం డిస్కౌంట్ వెసులుబాటు దక్కుతుందని IRCTC తెలిపింది.

రైల్వే తత్కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టికెట్ల బుకింగ్లో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దళారులకు చెక్ పెట్టేందుకు ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీటీసీ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్/యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అథంటికేటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విధానం అమల్లోకి తెచ్చింది. ఫోన్కు వచ్చే ఆధార్ ఓటీపీ ఎంటర్ చేస్తేనే తత్కాల్ టికెట్లు బుక్ అవుతాయి. ఆథరైజ్డ్ ఏజెంట్లకు తత్కాల్ టికెట్ల బుకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తొలి 30 నిమిషాల పాటు అవకాశం లేదు. అంటే.. ఏసీ క్లాస్కు ఉదయం 10.30 గంటల తర్వాత, నాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏసీ క్లాస్కు ఉదయం 11.30 గంటల తర్వాత మాత్రమే టికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెసులుబాటు ఉంది.

ఇదిలా ఉండగా.. దక్షిణ మధ్య రైల్వే పలు రూట్లలో 48 స్పెషల్ ట్రైన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. కాకినాడ-లింగంపల్లి, కాకినాడ-చర్లపల్లి రూట్లలో వారానికి మూడురోజులు స్పెషల్ రైళ్లు నడుస్తున్నాయి. కాకినాడ టౌన్-చర్లపల్లి (07447) రైలు జూలై 5, 2025 నుంచి.. మార్చి 28, 2026 వరకు, చర్లపల్లి - కాకినాడ టౌన్ (07448) రైలు జూలై 6 నుంచి మార్చి 29, 2026 వరకు నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. కాకినాడ టౌన్-లింగంపల్లి (07445) రైలు జూలై 2, 2025 నుంచి మార్చి 30, 2026 వరకు నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

లింగంపల్లి - కాకినాడ టౌన్ (07446) రైలు జూలై 3, 2025 నుంచి మార్చి 31, 2026 వరకు నడుస్తుందని రైల్వే శాఖ పేర్కొంది.ఈ ప్రత్యేక రైళ్లలో 1AC, 2AC, 3AC, 3AC ఎకానమీ, స్లీపర్ మరియు జనరల్ సెకండ్ -క్లాస్ కోచ్‌లు ఉంటాయి. దసరా, దీపావళి పండుగలకు తెలంగాణలోని పల్లెలకు వెళ్లే పబ్లిక్తో పాటు హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు వెళ్లే పబ్లిక్ కూడా ఉంటారు. ఆంధ్రా వెళ్లే పబ్లిక్కు ఈ కాకినాడ స్పెషల్ ట్రైన్స్ కచ్చితంగా బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు.