- దేశంలోని 28 లొకేషన్లలో ఫుడ్ తయారీ
న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కారణంగా పనులు లేక, తినేందుకు తిండి లేక ఇబ్బంది పడుతున్న పేదలను ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ఆదుకుంటోంది. లాక్‌డౌన్ విధించిన రోజు నుంచి ఇప్పటి వరకు 10లక్షల మందికి భోజనం అందించింది. శనివారం ఒక్కరోజే 62,990 మీల్స్‌ను డిస్ట్రిబ్యూట్ చేశారరు. దేశంలో మొత్తం 28 లొకేషన్లలో ఏర్పాటు చేసిన కిచెన్‌లలో ఫుడ్ తయారు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఆయా రాష్ట్రాల ప్రజల అభిరుచిని బట్టి భోజనం అందిస్తున్నామని అన్నారు. “ మార్చి 28 నుంచి 10 లక్షల మందికి భోజనం అందించాం. దీన్ని ఇలానే కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాం” అని ఐఆర్‌సీటీసీ అధికార ప్రతినిధి సిదార్థ సింగ్ అన్నారు. రోజుకు రెండుపూటల భోజనం అందిస్తున్నామని చెప్పారు. రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్, ఢిల్లీలో కరోనా డ్యూటీ చేస్తున్న పోలీస్ స్టాఫ్ కిచెన్‌ల నుంచి ఫుడ్ కలెక్ట్ చేసుకుని పంచిపెడుతున్నారని అన్నారు. ఫుడ్ తయారు చేసేందుకు వస్తున్న ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకుంటున్నారని, కిచెన్‌లోకి ఎంటరయ్యే ముందు సిబ్బందికి స్క్రీనింగ్ టెస్ట్ చేస్తున్నామని అధికారులు చెప్పారు. చేతులను శ్యానిటైజ్ చేసుకుని, మాస్కులు, గ్లౌజులు వేసుకుని జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారు.
