ఏ వయస్సు వాళ్లయినా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు.. పరిమితులు ఎత్తివేత

ఏ వయస్సు వాళ్లయినా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు.. పరిమితులు ఎత్తివేత

ఈ మధ్య కాలంలో హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ప్రాధాన్యత పెరుగుతోంది. కరోనా నేర్పిన పాఠం ఆనండి, లేక జనాల్లో పెరుగుతున్న హెల్త్ కాన్షియస్ నెస్ ఆనండి... ఇటీవలి కాలంలో హెల్త్ ఇన్సూరెన్స్ కి డిమాండ్ మాత్రం పెరిగిందనే చెప్పాలి. అయితే, 65ఏళ్ళ లోపు వారు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ, ఐఆర్దీయే ( IRDA ) తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఇకపై ఏ వయసు వారైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వెసలుబాటు వచ్చింది.

IRDA తీసుకున్న తాజా నిర్ణయం ఏప్రిల్ 1 నుండి అందుబాటులోకి వచ్చింది. హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో ఉన్న ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఎత్తేయాలని, వయోభేదం లేకుండా అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకునే అవకాశం ఇవ్వాలని తెలిపింది. అయితే, ఈ విషయంలో ఐఆర్డీయే కొన్ని సూచనలు కూడా చేసింది. దీంతో పాటు వెయిటింగ్ పీరియడ్ ని 48నెలల నుండి 36నెలలకు తగ్గించింది.