మూడో టీ20లో ఐర్లాండ్ చిత్తు.. ఇంగ్లండ్‌‎దే టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌

మూడో టీ20లో ఐర్లాండ్ చిత్తు.. ఇంగ్లండ్‌‎దే టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌

డబ్లిన్‌‌‌: ఆల్‌‌‌‌‌‌‌‌రౌండ్‌‌‌‌‌‌‌షోతో ఆకట్టుకున్న ఇంగ్లండ్‌ ఆదివారం ఐర్లాండ్‌‎తో జరిగిన మూడో టీ20లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌‎ల సిరీస్‌‌‎ను 2–0తో సొంతం చేసుకుంది. టాస్‌‌‌‌‌‌‌‌ఓడిన ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌20 ఓవర్లలో 154/8 స్కోరు చేసింది. గారెత్‌‌‌‌‌‌‌డిలానీ (48 నాటౌట్‌‌‌‌‌‌‌‌) టాప్‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌. రాస్‌‌‌‌‌‌‌‌అడెర్‌‌‌‌‌‌‌(33), హ్యారీ టెక్టర్‌‌‌‌‌‌‌(28), బెన్‌‌‌‌‌‌‌‌ కాలిట్జ్‌‌‌‌‌‌(22) రాణించినా.. లోర్కాన్‌‌‌‌‌‌‌‌టకెర్‌‌‌‌(1), కుర్టిస్‌‌‌‌‌‌‌‌ క్యాంపెర్‌‌‌‌‌‌‌(2), బారీ మెకార్తీ (0), మాథ్యూ హంప్రేస్‌‌‌‌‌‌(7) నిరాశపర్చారు.

ఆదిల్‌‌‌‌‌‌‌‌రషీద్‌ 3, లియామ్‌‌‌‌‌‌‌‌డాసన్‌, జెమీ ఒవర్టన్‌‌‌‌‌‌చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ 17.1 ఓవర్లలో 155/4 స్కోరు చేసి నెగ్గింది. జోర్డాన్‌‌‌‌‌‌‌‌కాక్స్‌‌‌‌‌‌‌‌ (55), టామ్‌‌‌‌‌‌‌‌ బాంటన్‌‌‌‌‌‌‌‌(37 నాటౌట్‌‌‌‌‌‌‌‌) చెలరేగారు. 10 రన్స్‌‎కే బట్లర్‌‌‌‌‌‌‌‌ (0) డకౌట్‌‌‌‌‌‌‌కాగా, ఫిల్‌‌‌‌‌‌‌‌ సాల్ట్‌‌‌‌‌‌‌‌ (29) నిలకడగా ఆడాడు. జాకబ్‌‌‌‌‌‌‌‌ బెథెల్‌‌‌‌‌‌‌‌ (15) ఫర్వాలేదనిపించాడు. మెకార్తీ, యంగ్‌‌‌‌‌‌‌‌, వైట్‌‌‌‌‌‌‌‌, క్యాంపెర్‌‌‌‌‌‌‌‌ తలా ఓ వికెట్‌‌‌‌‌‌‌‌ పడగొట్టారు.