గుండెపోటుతో కాంగ్రెస్ సర్పంచ్ మృతి

గుండెపోటుతో కాంగ్రెస్ సర్పంచ్ మృతి

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లింగాపూర్ కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్, ఈరెల్లి శంకర్(50) గుండెపోటుతో మృతి చెందారు. వ్యక్తిగత పనులపై పెగడపల్లి కి వెళ్లిన సర్పంచ్ శంకర్.. ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. దీంతో స్థానికులు కరీంనగర ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు బంధువులు తెలిపారు..