కోహ్లీ స్పిన్ బౌలింగ్ ఆడటం ప్రాక్టీస్ చెయ్ : ఇర్ఫాన్ పఠాన్

కోహ్లీ స్పిన్ బౌలింగ్ ఆడటం ప్రాక్టీస్ చెయ్ : ఇర్ఫాన్ పఠాన్

ఆసియా కప్ తో తిరిగి ఫామ్ లోకి వచ్చిన రన్ మెషిన్ విరాట్ కోహ్లీ సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్నాడు. అయితే, ఫామ్ లోకి వచ్చినా స్పిన్ బౌలింగ్ ని ఎదుర్కోవడంలో విరాట్ కాస్త తడబడుతున్నాడు. ఫిబ్రవరి 9 నుంచి ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్ట్ సిరీస్ లో అభిమానుల కళ్లన్నీ విరాట్ పైనే ఉండనున్నాయి. ఈ విషయంలో విరాట్ కి  మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ కొన్ని సూచనలు చేశాడు.

‘ఆస్ట్రేలియా సిరీస్ లో కోహ్లీ.. నాథన్ లయన్, ఆష్టన్ అగర్ లాంటి స్పిన్ బౌలర్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం స్పిన్ బౌలింగ్ లో విరాట్ స్ట్రైక్ రేట్ మునుపటితో పోల్చితే కాస్త తగ్గింది. అందుకే స్పిన్ బౌలింగ్ ఆడటంపై దృష్టిపెట్టాలి. బాల్స్ ని ఆడటం కష్టంగా మారినప్పుడు దూకుడు పెంచి ఎదురుదాడి చేయాలి. అప్పుడే రిజల్ట్ మారుతుంది. ఈ విషయాల్ని గుర్తుపెట్టుకుంటే కోహ్లీని ఇక ఎవరూ ఆపలేరు’ అని ఇర్ఫాన్ సూచించాడు.