అక్టోబర్ 11 నుంచి ఇర్ఫానీ దర్గా ఉర్సు ఉత్సవాలు

అక్టోబర్ 11 నుంచి ఇర్ఫానీ దర్గా ఉర్సు ఉత్సవాలు

సంగారెడ్డి టౌన్, వెలుగు: సంగారెడ్డి పట్టణ శివారులోని ఇర్ఫానీ దర్గా 23వ ఉర్సు ఉత్సవాలు అక్టోబర్ 11 నుంచి రెండు రోజులు జరుగుతాయని ఆదివారం పీఠాధిపతి హజరత్ హాకీమ్ అహ్మద్ సబ్జాద్ ఏ నశీన్ భార్గ ఇర్ఫానీ తెలిపారు. 11న సంగారెడ్డి లోని జామియా మసీద్ నుంచి సాయంత్రం 5 గంటలకు గంధం ఊరేగింపు రాత్రి 8 గంటలకు ఇర్ఫాన్ దర్గాలో గంధారాధన, 9 గంటలకు ఆల్ ఇండియా ముషాయిరా ఉంటుందన్నారు. 

12న సాయంత్రం దీపారాధన ఖవాలీ, అన్నదాన కార్యక్రమాలు ఉంటాయన్నారు. వివిధ వర్గాల పీఠాధిపతులు హాజరవుతారని వెల్లడించారు. ఈ సందర్భంగా పోస్టర్ ఆవిష్కరించారు. అహ్మద్ బిన్ ఉమర్ ఇర్ఫాన్, షేక్ షకీల్ అహ్మద్ ఇర్ఫానీ, షబ్బీర్ అహ్మద్ హస్మి, షహీద్ బిన్, సలీం ఖాన్, మీర్ అసర్ అలీ పాల్గొన్నారు.