ఇద్దరు కవల ఆడపిల్లలతో మదర్ శర్మిల

ఇద్దరు కవల ఆడపిల్లలతో మదర్ శర్మిల

హక్కుల కార్యకర్త, మణిపూర్ ఐరన్ లేడీ ఇరోమ్ శర్మిల .. ఇటీవల వచ్చిన మదర్స్ డే రోజున తల్లి అయింది. కవలలైన ఇద్దరు ఆడపిల్లలకు ఆమె జన్మనిచ్చారు. ఇద్దరు కవల పాపలతో ఆమె, ఆమె భర్త దిగిన ఫొటోలు ఇపుడు బయటకొచ్చాయి.

బెంగళూరులోని క్లౌడ్ నైన్ హాస్పిటల్ లో ఇరోమ్ శర్మిల ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చారు. 35 వారాల ప్రెగ్నెన్సీ తర్వాత..  సీ సెక్షన్ ఆపరేషన్ ద్వారా డెలివరీ చేశారు డాక్టర్లు.

మణిపూర్ లో సాయుధ బలగాలకు వ్యతిరేకంగా… 16 ఏళ్ల పాటు ఆమె దీక్ష చేశారు. దీక్ష విరమణ తర్వాత 2017లో డేస్మెడ్ ఆంటోనీ బెల్లర్మిన్ ను పెళ్లిచేసుకుని.. కొడైకెనాల్‌లో స్థిరపడ్డారు షర్మిల. ప్రెగ్నెన్సీ తర్వాత.. గతేడాది బెంగళూరుకు షిఫ్ట్ అయ్యారు. షర్మిల తన కవల పిల్లలకు నిక్స్ సఖి, ఆటమ్ తారా అని పేర్లు పెట్టారు.