గోదావరి తీర ప్రాంతంలో 15 రోజుల్లో అందుబాటులోకి ఐరన్ బ్రిడ్జ్: సీతక్క

గోదావరి తీర ప్రాంతంలో 15 రోజుల్లో అందుబాటులోకి ఐరన్ బ్రిడ్జ్: సీతక్క

ములుగు జిల్లాల్లో గోదావరి తీర ప్రాంతంలో 29 కిలోమీటర్ల  కరకట్ట నిర్మిస్తున్నామని మంత్రి సీతక్క చెప్పారు.  భవిష్యత్ అవసరాలను దృష్టిపెట్టుకుని కరకట్ట కడతామని తెలిపారు. కరకట్ట కోసం మూడేళ్ల కిందట గత ప్రభుత్వం జీవో విడుదల చేసినా.. నిధులు విడుదల చేయలేదని చెప్పారు.  రూ.137 కోట్లు మంజూరు కాగా.. ఆ నిధులు సరిపోవని మా దృష్టికి వచ్చిందని.. ముందుగా పనులు చేపట్టి.. ఆ తర్వాత అవసరమైన నిధులు అందిస్తామన్నారు. 

అత్యధికంగా ముంపుకు గురవుతున్న మంగపేట, ఏటూరునాగారంలో.. తొలి ప్రాధాన్యంగా కరకట్ట పనులు యుద్ధప్రాతిపదికన చేస్తామన్నారు. ఇరిగేషన్ అధికారులు, కలెక్టర్ తో  రివ్యూ మీటింగ్ నిర్వహించామని తెలిపారు. కొండాయి, ప్రాజెక్టు నగర్ లాంటి17 ముంపు ప్రాంతాలను గుర్తించామని.. ఈ వర్షాకాలంలో మళ్లీ ఆ ఊర్లను ముంచెత్తకుండా పనులు చేపట్టామని చెప్పారు. గతేడాది వరదలను దృష్టిలో పెట్టుకుని పనులు చేస్తున్నామని చెప్పారు. బూరుగు పేట దగ్గర 60 సెంటమీటర్ల పొడువు చెరువు తెగిపోవడంతో భారీ వరద వచ్చి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు.ఓ వైపు గోదవారి, మరోవైపు జంపన్న వాగు నుంచి ఒకేసారి వరద వస్తే తీవ్రంగా నష్టం జరిగే అవకాశం ఉందన్నారు.

పోలీస్, రెవెన్యూ ఇతర శాఖలతో అధికారులతో టీమ్స్ ఏర్పాటు చేస్తున్నామని..  వరదల ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న గ్రామాల్లో మూడు నెలల రేషన్ ముందుగానే అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు.  కొండాయి దగ్గర బ్రిడ్జి నిర్మాణానికి రూ.9.5 కోట్లు మంజూరు చేశాం.. కానీ పనులు పూర్తికావడానికి చాలా సమయం పడుతుందన్నారు. తాత్కాలికంగా కొండాయి ప్రజల కోసం ఐరెన్ బ్రిజ్జి నిర్మాణం 15 రోజుల్లో అందుబాటులోకి తెస్తామన్నారు. ఈనెల 12, 13 న మరోసారి జిల్లా అధికారులతో రివ్యూ నిర్వహించబోతున్నామని సీతక్క చెప్పారు.

ములుగు జిల్లాలో గోదావరి తీరప్రాంతంలో 29 కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మిస్తున్నామని తెలిపారు మంత్రి సీతక్క. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కరకట్ట కడతామన్నారు. ఇప్పటికే ప్రభుత్వం 37 కోట్లు మంజూరు చేసిందన్నారు. ప్రాథమికంగా మంగపేట, ఏటూరునాగారంలో యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేస్తామన్నారు. మరో 15 రోజుల్లో కొండాయి గ్రామంలో తాత్కాలికంగా ఐరెన్ బ్రిజ్జి అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ వర్షాకాలంలో వరదలకు గ్రామాలు మునిగిపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి సీతక్క.