వెటర్నరీ వర్సిటీ అధ్యాపక పోస్టుల భర్తీలో అక్రమాలు

వెటర్నరీ వర్సిటీ అధ్యాపక పోస్టుల భర్తీలో అక్రమాలు

ఓయూ,వెలుగు: పీవీ నర్సింహరావు వెటర్నరీ వర్సిటీలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీలో అక్రమాలు జరిగాయని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతారాయ్ ఆరోపించారు. బుధవారం ఆయన ఓయూ ఆర్ట్స్​కాలేజీ వద్ద మాట్లాడుతూ..వర్సిటీ పరిధిలోని వనపర్తి, పెబ్బేరు మత్య్స కాలేజీల్లోని 7 అసిస్టెంట్ ​ప్రొఫెసర్​ పోస్టుల భర్తీకి అర్హతలున్న తెలంగాణకు చెందిన వారిని కాకుండా కర్నాటకకు చెందిన నాన్​-లోకల్​ క్యాండిడేట్లను ఎంపిక చేశారన్నారు. ఈ ఉత్తర్వులను రద్దు చేసి తిరిగి ఇంటర్వ్యూలు నిర్వహించి స్థానికులనే ఎంపిక చేయాలని ఆయన డిమాండ్​ చేశారు.