నీట్ అక్రమాలను సరిదిద్దాలి : ప్రియాంక గాంధీ

నీట్ అక్రమాలను సరిదిద్దాలి : ప్రియాంక గాంధీ
  •  కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ: నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలను సరిదిద్దడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆమె ట్వీట్ చేశారు. ‘‘నీట్ వంటి పరీక్షల కోసం లక్షల మంది పిల్లలు కష్టపడి సిద్ధమవుతారు. తమ జీవితంలోని అత్యంత విలువైన క్షణాలను దాని కోసం వెచ్చిస్తారు. ఈ సమయంలో కుటుంబం మొత్తం వారికి అండగా నిలుస్తుంది.

 కానీ, ఈ పరీక్షల్లో ఏటా పేపర్ లీక్​లు, ఫలితాలకు సంబంధించిన అక్రమాలు జరుగుతున్నాయి. పరీక్షలు నిర్వహించిన ఏజెన్సీలు ఈ అక్రమాలకు జవాబుదారీ వహించ లేవా? ప్రభుత్వం తన నిర్లక్ష్య వైఖరిని వీడి పరీక్ష విధానంపై సీరియస్​గా దృష్టి పెట్టా లేదా? యూత్ కలలు ఈ విధంగా చెదిరిపోవడాన్ని మనం చూడలేం. వారి శ్రమకు సిస్టమ్ చేస్తున్న అన్యాయం ఆగిపోవాలి” అని ట్విట్టర్‌‌లో పేర్కొన్నారు.