
టెక్నాలజీ రైతుల ఆదాయాన్ని పెంచుతుంది: సోమేశ్ కుమార్
హైదరాబాద్, వెలుగు: సాగు నీటి నిర్వహణలోఇంజనీర్ల మేథస్సు ఎంతో కీలకమని నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేశ్ కుమార్ అన్నారు. ఖైరతాబాద్ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్(IOE) ఆధ్వర్యం లో సోమవారం జరిగిన ‘‘రైతుల ఆదాయం రెట్టిం పు చేయడంలో ఇంజనీర్ల పాత్ర”అనే సెమినార్ కు హాజరై ప్రసంగిం చారు. ప్రభుత్వం కడుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టుల్లోని ఇంజనీర్లు సమర్ధవంతంగా వాడటం వల్లే ఫలాలు ప్రజలకు అందుతాయని చెప్పారు. వ్యవసాయ రంగానికి ఇంజనీర్లు టెక్నాలజీని అందించాలని కోరారు. దీని వల్ల రైతుల ఆదాయం పెరుగుతుం దన్నారు. పాలీహౌస్, గ్రీన్హౌస్, షెడ్ నెట్ ద్వారా చేసే సాగు విస్తరిస్తోందని అగ్రీ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్ రావు పేర్కొన్నారు.ఈ నేపథ్యం లో ఇంజనీర్లు వాటిని మరిం త మెరుగుపరచాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో ఐఓఈ చైర్మన్ రామేశ్వర్ రావు, రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ చైర్మన్ శ్యాం ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.