హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్ ఈఎన్సీ(జనరల్) రమేశ్ బాబు పదవీ కాలాన్ని ప్రభుత్వం 6 నెలలు పొడిగించింది. మంగళవారం ఆయ న పదవీకాలం ముగియగా.. సర్కారు సెప్టెంబర్ 30 వరకు ఎక్స్ టెన్షన్ ఇచ్చింది. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ కార్యదర్శి శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, కాంట్రాక్ట్ పద్ధతిలోనే ఆయన ఈ పదవిలో కొనసాగుతారని పేర్కొన్నారు.
ఇటు ఈఎన్సీ(ఓఅండ్ఎం) శ్రీనివాస్ రిటైరవడంతో.. ఆయన స్థానంలో ఈఎన్సీ అడ్మిన్ శ్రీనివాస్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే, హైదరాబాద్ ఇంజినీర్స్ అసోసియేషన్, తెలంగాణ ఇరిగేషన్ గ్రాడ్యుయేట్స్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఎక్స్ టెన్షన్ ఇవ్వొద్దని ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కు విజ్ఞప్తి చేశాయి. మరో సారి ఆయా సంఘాల ప్రతినిధులు మంత్రికి మంగళవారం లేఖ రాశారు.
