ఫ్రూట్ సలాడ్ లో ఉప్పు వేస్తున్నారా.. మీ ఆరోగ్యం జాగ్రత్త

ఫ్రూట్ సలాడ్ లో ఉప్పు వేస్తున్నారా.. మీ ఆరోగ్యం జాగ్రత్త

ఫ్రూట్ జ్యూస్ ల కంటో.. నేరుగా ఫ్రూట్స్ ను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని 'ఫ్రూట్ సలాడ్' అంటారు. వీటిలో కేవలం పండ్లు మాత్రమే కాదు కూరగాయలు కూడా కలుపుకోవచ్చు. పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే. పండ్లు శరీరానికి విటమిన్లు, మినరల్స్, ఫైబర్ వంటి పోషకాలను అందిస్తాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జీవక్రియ బలంగా ఉంటే శరీరానికి వ్యాధులను ఎదుర్కోగల సామర్థ్యం ఉంటుంది. ఆరోగ్యాన్నిచ్చే ఈ ఫ్రూట్ సలాడ్ లో చాలా మంది ఉప్పు కలుపుకుని తింటూ ఉంటారు. అలాంటి అలవాటు ఉంటే వెంటనే ఆపేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పండ్లను ఉప్పు లేదా చాట్ మసాలాతో కలిపి తీసుకుంటే వాటి రుచి బాగా ఉంటుంది, కానీ అలా చేయడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. అంతే కాదు, పండ్లను ఉప్పుతో కలిపి తినడం వల్ల అనేక వ్యాధులు వాటిల్లుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పండ్లపై ఉప్పు చల్లడం వల్ల కలిగే నష్టాలు:

  •     పండ్లపై ఉప్పు చల్లి తినడం వల్ల వాటిలోని పోషకాలు నశిస్తాయి. పండ్లతో పాటు ఉప్పు తీసుకోవడం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులు కూడా వస్తాయి.
  •     పండ్లలో ఉప్పును కలపడం ద్వారా అలెర్జీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇది శరీరంలో వాపును కూడా కలిగిస్తుంది.
  •     అధిక రక్తపోటు ఉన్నట్లయితే, ఉప్పుతో పండ్లను తినడాన్ని ఎప్పుడూ చేయకూడదు. ఇలా చేయడం వల్ల రక్తపోటు పెరుగుతుంది.
  •     హృద్రోగులు కూడా పండ్లతో పాటు ఉప్పును అస్సలు తినకూడదు. పండుపై ఉప్పు వేసిన వెంటనే నీరు రావడం ప్రారంభమవుతుంది. ఇది పండ్ల పోషణను తగ్గిస్తుంది.

పండ్లు ఎలా తినాలి:

  •     పండ్లను తినేటప్పుడు, మీరు ఒకసారి ఒక పండు మాత్రమే తినాలని గుర్తుంచుకోండి.
  •     మీరు ఫ్రూట్ చాట్ తినాలనుకుంటే, తీపి లేదా పుల్లని పండ్లతో మాత్రమే సలాడ్ చేయండి.
  •     పులుపు, తీపి ఫ్రూట్ సలాడ్లను కలిపి తినకూడదు.
  •     పండ్లు కోసిన గంటలోపు తినాలి.
  •     ఎక్కువ కాలం ఉంచిన పండ్లలో కూడా పోషకాలు తగ్గడం ప్రారంభిస్తాయి.