
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ‘ఓజీ’ విజయంలో ఉన్నారు. రూ.400 కోట్ల కెరీర్ హయ్యెస్ట్ కలెక్షన్స్తో పవన్ మంచి దూకుడు మీద ఉన్నారు. ఇపుడు ఈ సక్సెస్.. పవన్ కళ్యాణ్కి కంటే.. తమ అభిమానులనే ఎక్కువ ఖుషి చేస్తుంది.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్తో వరుసబెట్టి సినిమాలు చేయడానికి టాలీవుడ్ మేకర్స్ క్యూ కడుతున్నారు. ఇలాంటి క్రమంలోనే పవన్ ఫ్యాన్స్ను భయపడేలా చేస్తున్నాడు ఓ డైరెక్టర్. అసలు పవన్తో సినిమాలు చేస్తే భయమెందుకు అంటారా? అవును భయమే! ఆ డైరెక్టర్ పేరు చెబితే.. ఏ హీరో ఫ్యాన్స్ కైనా అనుమానమే! ఇంతకు ఎవరా ఆ డైరెక్టర్? అసలు విషయం ఏంటనే వివరాల్లోకి వెళితే..
Also Read: చిరు సరసన మాలవికా మోహనన్?
డైరెక్టర్ మెహర్ రమేష్ తెలుగు ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు. స్టార్ హీరోలతో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ ఫెయిల్యూర్స్ ఇచ్చిన డైరెక్టర్గా పాపులర్ అయ్యారు. ఇటీవలే మెగాస్టర్ చిరంజీవితో భోళా శంకర్ సినిమా తీసి భారీ డిజాస్టర్ అందించారు. ఇపుడు ఈ డైరెక్టర్, పవన్ కళ్యాణ్తో సినిమా చేయడానికి తెగ పడిగాపులు కాస్తున్నట్టు సినీ వర్గాల సమాచారం.
హరిహర వీరమల్లు షూటింగ్ టైంలోనే, పవన్ని చాలాసార్లు కలిసి స్టోరీ వినిపించినట్లు టాక్. అందుకోసం అన్నీ ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నాడట. కేవలం పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే ఆలస్యం అని తెలుస్తోంది.
Witnessed Sep 2024 🙏🏼
— Meher Raamesh (@MeherRamesh) July 23, 2025
sri @PawanKalyan as a leader fierce 🔥press meets & as a #PowerStar busy shooting ,Singing #matavinali for sri @mmkeeravaani & as a
Hon @APDeputyCMO governance by giving 20 hrs a day but still the same POWER 🙌🏻
I pray for @HHVMFilm sri @AMRathnamOfl huge… pic.twitter.com/FHUHAY1vW2
ఈ క్రమంలోనే.. ‘పవన్తో మెహర్ సినిమా’ అనే వార్తలు ఊపందుకున్నాయి. ఇవి కాస్త పవర్ స్టార్ ఫ్యాన్స్ చెవిలో పడ్డాయి. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డిస్సప్పాయింట్ అవుతున్నారు. ఒకవేళ వీరి కాంబోలో సినిమా వస్తే కనుక, ఆశలు వదులుకున్నట్లే అనేలా కామెంట్స్ షురూ చేస్తున్నారు. మరి మెగా కుటుంబానికి దగ్గరి బంధువైన మెహర్ ప్రయత్నాలు.. చివరికి ఎలాంటి ఫలితాన్ని అందిస్తాయో చూడాలి. ఏదేమైనా.. ఎన్ని ఫెయిల్యూర్స్ తీసిన.. స్టార్ హీరోలకి స్టోరీ చెప్పి, ఒప్పించడంలో మెహర్ తర్వాతే ఎవరైనా!!
డైరెక్టర్ మెహర్ రమేష్ సినిమాలు:
గతంలో మెహర్ రమేష్ నుంచి వచ్చిన శక్తి, షాడో, భోళా శంకర్ మూవీలు బాక్సాపీస్ వద్ద భారీ డిజాస్టర్గా నిలిచాయి. ఇక శక్తి సినిమా నిర్మాత అశ్వనీదత్ను కోలుకోలేని దెబ్బతీసింది. ఈ సినిమాతో భారీగా నష్టపోయానని స్వయంగా నిర్మాతనే ప్రకటించడం విశేషం.
అయితే, మెహర్ రమేష్ ఇప్పటివరకు తీసిన బిల్లా,శక్తి, షాడో సినిమాలలో.. బిల్లా మూవీ తప్ప మిగిలిన సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. నిజానికి మెహర్ రమేష్ రీమేక్ మూవీస్ను తెరకెక్కించడంలో ఫెమస్ అని ఇండస్ట్రీ టాక్.
కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలు వీరకన్నడిగ, అజయ్ తెలుగు ఆంధ్రావాలా, ఒక్కడు సినిమాలకు రీమెక్సే. ఈ రెండు సినిమాలను తెరకెక్కించింది మెహర్ రమేషే. ఇలా మెహర్ రమేష్ కెరియర్లో హిట్ కొట్టిన మూడు సినిమాలు రీమేక్ చేసినవే.