ప్రైవేట్ వెబ్ సైట్ లో ప్రజల ఆస్తుల వివరాలు పెట్టడం కరెక్టేనా: జగ్గారెడ్డి

ప్రైవేట్ వెబ్ సైట్ లో ప్రజల ఆస్తుల వివరాలు పెట్టడం కరెక్టేనా: జగ్గారెడ్డి

ప్రజలు చెప్తేనే ప్రభుత్వం పని చేస్తుంది.. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కేసీఆర్ చెప్తేనే ప్రజలు వినాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.  అసెంబ్లీ మీడియా పాయింట్  దగ్గర మాట్లాడిన ఆయన ..గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మాత్రం ప్రజలు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఇచ్చిన దరఖాస్తులు సలహాలు సూచనల పై  చర్చించి నిర్ణయాలు తీసుకునేదని తెలిపారు. SC ST సబ్ ప్లాన్ కూడా ఇదే విధంగా కాంగ్రెస్ తీసుకొచ్చిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు చెప్తే వినే పరిస్థితి లో ప్రభుత్వం లేదన్నారు.

ప్రజల ఆస్తులను కాపాడేందుకు ధరణి వెబ్ సైట్ లో పొందుపరుస్తమని ప్రభుత్వం చెప్పిందని…ఆల్రెడీ అస్తుల వివరాలు ఉన్నా కూడా  ప్రైవేట్ సంస్థకు చెందిన ధరణి వెబ్ సైట్ లో పొందుపరచడం ఎందుకని ప్రశ్నించారు జగ్గారెడ్డి. ప్రైవేట్ వెబ్ సైట్ లో ప్రజల ఆస్తుల వివరాలు పెట్టడం కరెక్టేనా అని అన్నారు. ఏ రాష్ట్రంలో కూడా  ప్రజల ఆస్తులకు సంబంధించిన ఇలాంటి ప్రైవేట్ సంస్థకు చెందిన వెబ్ సైట్ లో పెట్టడం లేదన్నారు.  ధరణి వెబ్ సైట్ పై  అసంబ్లీ లో కూడా మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ కి సరిగా అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. ధరణి వెబ్ సైట్ పై ప్రజలకు చాలా అనుమానాలున్నాయన్నారు. ధరణి ప్రైవేట్ వెబ్ సైట్ లో ఉన్న ఆస్తులకు తాకట్టు పెట్టి …అప్పులు తీసుకుంటే మా పరిస్థితి ఏంటనే డౌట్ ప్రజల్లో ఉందన్నారు జగ్గారెడ్డి. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మరోవైపు సర్వే పేరుతో ప్రభుత్వం తీసుకుంటున్న వివరాల్లో ఆస్తుల వివరాలే నమోదు చేస్తున్నారన్నారు. మరి ప్రజలకు ఉన్న అప్పుల వివరాలు కూడా ఎందుకు  నమోదు చేయడం లేదన్నారు. చాలామంది ప్రజలు లోన్లు తీసుకొని ఇళ్లు కట్టుకుంటారు…బ్యాంక్ లకు EMI లు కడుతుంటారు.. ఇది ప్రజలకు అప్పు కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ కు సలహా  ఇచ్చింది IAS అధికారులో లేక  మంత్రులో కానీ అది అనర్ధాలకు దారి తీస్తుందన్నారు. కేసీఆర్ కారణంగా…రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారుతుందన్నారు జగ్గారెడ్డి. తెలంగాణ కోటి రతనాల  వీణ కాదు…తెలంగాణ కోట్ల అప్పుల  వీణా అనాల్సి వస్తుందన్నారు.