
టీం ఇండియా మాజీ కెప్టెన్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియాకు అన్ని ఫార్మాట్లలో ట్రోఫీ అందించిన కెప్టెన్ గా ధోనికి ప్రత్యేక గుర్తింపు ఉంది.అంతర్జాతియ క్రికెట్ నుంచి తప్పుకున్న ధోని 44 ఏళ్ళ వయసులో కూడా ఐపీఎల్ ఆడుతున్నాడు. అయితే.. ధోని ముంబై ఇండియన్స్ జెర్సీలో కనిపిస్తున్న ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. కొంతమంది యంగ్ ప్లేయర్స్ తో కలిసి ముంబై ఇండియన్స్ జెర్సీలో ధోని కనిపించడం ఫ్యాన్స్ ని షాక్ కి గురి చేస్తోంది.
ధోని ముంబై ఇండియన్స్ జెర్సీలో ఉన్న ఫోటో ఇంటర్నెట్లో వైరల్ గా మారడంతో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. వచ్చే 2026 ఐపీఎల్ లో ధోని ముంబై ఇండియన్స్ తరఫున రంగంలోకి దిగనున్నారని.. అందుకే ముంబై ఇండియన్స్ టీంతో ప్రాక్టీస్ చేస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యను తొలగించి ధోనికి కెప్టెన్సీ ఇవ్వనున్నారంటూ మరికొంతమంది ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ధోని త్వరలోనే ముంబై ఇండియన్స్ పగ్గాలు చేపట్టనున్నాడని అంటున్నారు ఫ్యాన్స్. మరి, ఇంటర్నెట్ ను ఊపేస్తున్న ఈ ఫోటో వెనక నిజం ఏంటో.. ధోని చెన్నై సూపర్ కింగ్స్ కి గుడ్ బై చెప్పి ముంబై ఇండియన్స్ పగ్గాలు చేపట్టనున్నారన్న వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే వేచి చూడాలి.